నవ్వులు పూయించిన నయన్‌ అమ్మోరు తల్లి  

nayanatara ammoru thalli movie trailer talk Ammoru Thalli, Nayanatara, OTT, Ammoru Thalli Trailer Talk, RJ Balaji, Diwali, Family Entertainment - Telugu Ammoru Thalli, Ammoru Thalli Trailer Talk, Diwali, Family Entertainment, Nayanatara, Nayanatara Ammoru Thalli Movie Trailer Talk, Ott, Rj Balaji

నయనతార తమిళనాట వరుసగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తోంది.ఆమె సినిమాలు అక్కడ భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

TeluguStop.com - Nayanatara Ammoru Thalli Trailer Talk

తెలుగులో కూడా అవి మంచి విజయాన్ని సాధించిన దాఖలాలు చాలా ఉన్నాయి.ఇప్పుడు నయనతార నటించిన ‘మూకుత్తి అమ్మన్‌’ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లి అనే టైటిల్‌ తో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అందుకు సంబంధించిన డబ్బింగ్‌ కూడా పూర్తి అయ్యింది.ఈ సినిమాను దీపావళి సందర్బంగా నవంబర్‌ 14వ తారీకున విడుదల చేయబోతున్నారు.

TeluguStop.com - నవ్వులు పూయించిన నయన్‌ అమ్మోరు తల్లి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అమ్మోరు తల్లి టైటిల్‌ వినగానే సినిమా చాలా గాంభీర్యంగా ఉంటుందని అనిపిస్తుంది.కాని ట్రైలర్‌ చూసిన తర్వాత ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తేలిపోయింది.

అమ్మోరు తల్లితో కామెడీ చేయించే కొత్త ప్రయత్నంను దర్శకుడు చేశాడు.

ఆర్‌జే బాలాజీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చారు.

మంచి సందేశంతో పాటు సినిమాతో ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా ప్రేక్షకులకు అందించేందుకు రెడీ అవుతున్నారు.నయనతార అమ్మవారిగా ఒక ఫ్యామిలీకి ప్రత్యక్ష్యం అవుతుంది.

ఆమె నిజంగా అమ్మవారు అని మొదట ఆ ఫ్యామిలీ నమ్మదు.కాని ఎప్పుడైతే తన మాయాలతో ఆ ఫ్యామిలీ కష్టాలను తీర్చుతుందో అప్పటి నుండి అమ్మ వారు అని నమ్ముతారు.

ఇక అమ్మ వారు దేవుడి పేరుతో జనాలను మోసం చేస్తూ పిచ్చి వారిని చేస్తున్న వారి గుట్టు రట్టు చేసేందుకు ఆ ఫ్యామిలీని ఉపయోగించుకుంటుంది.మొత్తానికి సినిమాను తమిళ మరియు తెలుగులు ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసే విధంగా ఉంది.

హాట్‌ స్టార్‌ లో ఈ సినిమా దీపావళి కానుకగా స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.టాలీవుడ్‌ లో నయనతారకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో అమ్మోరు తల్లి సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

తెలుగు వర్షన్‌ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

#Ammoru Thalli #Diwali #RJ Balaji #AmmoruThalli #Nayanatara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nayanatara Ammoru Thalli Trailer Talk Related Telugu News,Photos/Pics,Images..