ప్రభుదేవాతో బ్రేకప్ పై స్పందించిన నయనతార.. ఏం చెప్పారంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది సంవత్సరాల తరబడి ప్రేమించుకుని వేర్వేరు కారణాల వల్ల తర్వాత కాలంలో విడిపోయిన సంగతి తెలిసిందే.అలా విడిపోయిన ప్రేమ జంటల్లో నయనతర ప్రభుదేవా ప్రేమ జంట కూడా ఒకటి.

 Nayanatara About Break Up With Prabhu Deva-TeluguStop.com

నయనతార ప్రేమించే సమయానికే ప్రభుదేవాకు పెళ్లైనా ఆమె మాత్రం ప్రభుదేవాను ప్రేమించారు.అయితే ప్రభుదేవాతో బ్రేకప్ కు సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు ఎదురైనా ఆమె స్పందించలేదు.

అయితే తాజాగా ఒక సందర్భంలో ప్రభుదేవాతో బ్రేకప్ కావడానికి గల కారణాలను నయనతార వెల్లడించారు.ప్రభుదేవాతో బ్రేకప్ వల్ల లైఫ్ లో ఎన్నో గుణపాఠాలను నేర్చుకున్నానని నయనతార తెలిపారు.

 Nayanatara About Break Up With Prabhu Deva-ప్రభుదేవాతో బ్రేకప్ పై స్పందించిన నయనతార.. ఏం చెప్పారంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను అలా జరగడంతో వ్యక్తిగా చాలా మారానని ఆమె అన్నారు.వ్యక్తులకు దూరమైన తరువాత ప్రతి మనిషిలో మార్పులు జరుగుతాయని అదే విధంగా తనలో కూడా మార్పులు జరిగాయని నయనతార అన్నారు.

లైఫ్ తలకిందులైన విధంగా బ్రేకప్ తర్వాత అనిపించిందని మెంటల్ గా కోలుకోవడానికి తాను సిద్ధమయ్యానని నయనతార తెలిపారు.ఎదురైన సమస్యలను పరిష్కరించుకోవాలని భావించానని ఆమె వెల్లడించారు.

ప్రభుదేవాను ప్రేమించిన తరువాత నయనతార సినిమాలకు కూడా దూరం కావాలని భావించారు. శ్రీరామ రాజ్యం సినిమా తరువాత ఆమె సినిమాలకు దూరమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.

Telugu Breakup With Prabhudeva, Comments Viral, Nayanatara, Vignesh Shivan-Movie

అయితే బ్రేకప్ తర్వాత విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడిన నయనతార లేడీసూపర్ స్టార్ గా ఎదగడంతో పాటు వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు.ప్రస్తుతం నయనతార చేతిలో వరుస సినిమా ఆఫర్లు ఉండగా ఆమె ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల నుంచి 6 కోట్ల రూపాయల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఆమె సినిమాలకు భారీగా మార్కెట్ జరుగుతుండటంతో నిర్మాతలు సైతం ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ప్రస్తుతం నయనతార ఇతర భాషల కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నారు.

#Vignesh Shivan #Nayanatara #Comments Viral #BreakupWith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు