ప్రియుడు నిర్మాణం లో నయన్ 65 వ చిత్రం, కొరియన్ థ్రిల్లర్ రీమేక్!  

Nayan Thara Is Doing Korean Remake Film-darbar,korian Remake Film,nayan Thara,saira Narasimha Reddy,vignesh Sivan

సూపర్ స్టార్ లు కధానాయకులే కాదు కథానాయకి లు కూడా ఉంటారు అన్న విషయాన్నీ మరోసారి నిరూపించిన నటి లేడీ సూపర్ స్టార్ నయనతార.ఆమె గురించి చెప్పాలి అంటే ఆమె ఏదైనా సినిమా చేస్తుంది అంటే కనీసం నయన్ కోసం అయినా ప్రేక్షకుడు తప్పకుండా సినిమా చూడాల్సిందే.

Nayan Thara Is Doing Korean Remake Film-darbar,korian Remake Film,nayan Thara,saira Narasimha Reddy,vignesh Sivan-Nayan Thara Is Doing Korean Remake Film-Darbar Korian Film Nayan Saira Narasimha Reddy Vignesh Sivan

అలాంటి మంచి ఇమేజ్ ని తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే దర్బార్,బిగిల్,సైరా చిత్రాలతో మంచి బిజీ గా ఉంది.త్వరలో ఈ చిత్రాలు అన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Nayan Thara Is Doing Korean Remake Film-darbar,korian Remake Film,nayan Thara,saira Narasimha Reddy,vignesh Sivan-Nayan Thara Is Doing Korean Remake Film-Darbar Korian Film Nayan Saira Narasimha Reddy Vignesh Sivan

అయితే ఈ ముద్దుగుమ్మ మరో చిత్రానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.అది కూడా ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ తొలిసారిగా నిర్మాణ బాధ్యతలని నిర్వర్తిస్తూ చేస్తున్న ఒక కొరియన్ రీమేక్ ఫిల్మ్ కి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.రౌడీ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి మిలింద్‌రావ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.రీసెంట్‌గా టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇందులో బ్రెయిలీ లిపిలో రాసిన అక్షరాల్ని ఓ యువతి చేతితో తడుముతూ ఉంది.

సంకెళ్లు, రక్తం మరకలతో నిండివున్న ఈ పోస్టర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ‘నెట్రికన్‌’ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించబోతున్నట్లు ఈ పోస్టర్ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది.

అయితే ఈ చిత్రం నయన్ కి 65 వ సినిమా కావడం విశేషం.‘నెట్రికన్‌’ టైటిల్‌తో 1981లో బాలచందర్‌ నిర్మాణంలో రజనీకాంత్‌ సినిమా ఒకటి వచ్చింది.అయితే ఇప్పుడు అదే టైటిల్ ని ఉపయోగించి ఈ చిత్రంలో నయన్ నటిస్తుండడం తో ఇప్పుడు తమిళ చిత్ర సీమలో ప్రాధాన్యత సంతరించుకుంది.