కేటీఆర్ పై నక్సల్స్ రెక్కీ ..?  

  • టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉండడమే కాకుండా… కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలోకి ఎక్కిన కల్వకుంట్ల రామారావును ఇప్పుడు నక్సల్స్ టార్గెట్ చేశారనే వార్తలు కలవరం పుట్టిస్తున్నాయి. ఇటీవల ఏపీలో ఒక ఎమ్యెల్యే మాజీ ఎమ్యెల్యేను హతమార్చిన నక్సల్స్ ఆ తరువాత ఎదో ఒకటి చేసి సంచలనం కలిగించాలని చూస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని రెక్కీ నిర్వహించారని తెలియడంతో వారికి భద్రత పెంచారు. కానీ ఇప్పుడు ఏకంగా కేటీఆర్ వారి టార్గెట్ అని తేలడం తెలంగాణాలో కలకలం సృష్టిస్తోంది.

  • Naxals Reiki On KTR-

    Naxals Reiki On KTR

  • మంత్రి కేటి రామారావును టార్గెట్ చేసుకుని జనశక్తి రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జనశక్తి జిల్లా కార్యదర్శి జక్కుల బాబుతో పాటు మరో నక్సలవైట్ శ్రీకాంత్‌ పట్టుబడ్డారు. తంగెళ్ళపల్లి మండలం చిన్నలింగాపూర్‌ గ్రామానికి చెందిన బాబు 2016లో జనశక్తి విప్లవ పార్టీ ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లాడు.

  • Naxals Reiki On KTR-
  • తనకు జనశక్తి అగ్ర నాయకత్వం ఓ ఆయుధాన్ని అప్పగించిందని, సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ పునర్మిర్మాణ బాధ్యతలను అప్పగించిందని విచారణలో అతను చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే మంత్రి కేటీఆర్‌ను నక్సలైట్లు లక్ష్యం చేసుకున్నారని అంటున్నారు. విచారణ పూర్తి వివరాలను రాష్ట్ర డీజీపీకి సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నెక్సెల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న నాయకులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ఏజెన్సీ లో ప్రచారం నిర్వహించే సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారుల నుంచి సూచనలు అందుతున్నాయి.