సినిమాకు రూపాయి పారితోషికం తీసుకున్న హీరో.. ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ఇతర ఇండస్ట్రీల హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరిగాయి.కొంతమంది హీరోలు కథ, కథనం కంటే రెమ్యునరేషన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు.

 Nawazuddin Siddiqui Charge Single Rupee Manto Movie-TeluguStop.com

తమకు అందాల్సిన రెమ్యునరేషన్ అందకపోతే హీరోలు నిర్మాతలపై ఫిర్యాదులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే ఒక బాలీవుడ్ హీరో మాత్రం తన సినిమాకు కేవలం ఒక్క రూపాయి పారితోషికంగా తీసుకున్నారు.

ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ మొత్తం మాంటో మూవీకి పారితోషికంగా తీసుకోవడం గమనార్హం.

 Nawazuddin Siddiqui Charge Single Rupee Manto Movie-సినిమాకు రూపాయి పారితోషికం తీసుకున్న హీరో.. ఎందుకంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫేమస్ ఉర్దూ రైటర్ లలో ఒకరైన సాదత్ మాంటో హాసన్ లైఫ్ హిస్టరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కడం గమనార్హం.

ప్రముఖ డైరెక్టర్, నటి నందితా దాస్ ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో ప్రముఖ నటులు పరేష్ రావల్, జావేద్ అక్తర్, రిషి కపూర్ నటించగా వాళ్లు కూడా ఫ్రీగానే నటించారని సమాచారం.

నందితా దాస్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.స్క్రిప్ట్ కు వాల్యూ ఇచ్చి కొంతమంది నటులు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని నందితా దాస్ తెలిపారు.

సినిమాలో కీలక పాత్రలో నటించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కేవలం రూపాయి మాత్రమే పారితోషికంగా తీసుకున్నారని వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజమని నందితా దాస్ అన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ రూపాయి పారితోషికం తీసుకోవడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను మాంటో మూవీ ద్వారా తన ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలని అనుకున్నానని నవాజుద్దీన్ చెప్పుకొచ్చారు.

నందితా దాస్ నుంచి ఈ మూవీ కొరకు డబ్బును ఆశిస్తే అంతకు మించిన తప్పు మరొకటి ఉండదని నవాజుద్దీన్ వెల్లడించారు.

నటన అనేది తన ప్రొఫెషన్ కాబట్టి ఒక్క రూపాయి మాత్రం పారితోషికంగా తీసుకున్నానని నవాజుద్దీన్ సిద్దిఖీ వెల్లడించారు.కేవలం రూపాయి పారితోషికం తీసుకున్నందుకు నవాజుద్దీన్ సిద్దిఖీను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

#OneRupee #Nandita Das #BollywoodActor #Single Rupee #BollywoodActor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు