రవికృష్ణ ప్రేమకు గుడ్ బై చెప్పిన సీరియల్ నటి.. మరో ఆప్షన్ లేనేలేదంటూ?

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే సినిమాలకు సంబంధించిన విషయాల గురించి, సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు, సీరియల్ నటుల ప్రేమ సంగతులు, అలాగే సెలబ్రిటీల డేటింగ్ విషయాలపై నిత్యం ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.

 Navya Swamy Says Good Bye To Relationship With Ravi Krishna, Navya Swami, Ravi Krishna, Break Up, Viral Video,-TeluguStop.com

ఇప్పటికే బుల్లితెరపై ఎంతోమంది జోడీలు ప్రేమ కహాని తో ఫేమస్ అయ్యారు.అలాంటి జోడీ లో నవ్య స్వామి, రవి కృష్ణ జోడీ ఒకటి.

బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు నటుల మధ్య నడిచిన కెమిస్ట్రీ, క్లోజ్ నెస్ చూసి వాళ్లు ప్రేమ లో ఉన్నారు అంటూ వార్తలను సృష్టించారు.

 Navya Swamy Says Good Bye To Relationship With Ravi Krishna, Navya Swami, Ravi Krishna, Break Up, Viral Video, -రవికృష్ణ ప్రేమకు గుడ్ బై చెప్పిన సీరియల్ నటి.. మరో ఆప్షన్ లేనేలేదంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తమ మధ్య ఉన్నది కేవలం స్నేహ బంధం అని ఆ ఇద్దరు నటులు చెప్పినప్పటికీ వారి పై వస్తున్న రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న క్యాష్ షోకీ హాజరయ్యారు.వీరితో పాటుగా రియల్ కపుల్ అయిన సిద్ధార్థ్,విష్ణు ప్రియ లు కూడా హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే సుమ ఆ ఇద్దరు జంటలతో కలసి కొన్ని రొమాంటిక్ టాస్క్ లు చేయించింది.ఇక ఈ షో లో నవ్య స్వామి, రవి కృష్ణ కు బ్రేకప్ చెప్పిన సీన్ హైలెట్ అయ్యింది.

వారిద్దరి లవ్ విషయంలో నవ్య స్వామి, రవికృష్ణ ను హర్ట్ చేస్తూ ఓపెన్ అయింది.

ఆ తర్వాత సిద్ధార్థ్, విష్ణుప్రియ లతో ముద్దుల టాస్క్ చేయించింది సుమ.నవ్య స్వామి,రవి కృష్ణ రొమాంటిక్ మూమెంట్స్ చూసిన సుమ మీరు రియల్ లైఫ్ కపుల్ కాదు రీల్ లైఫ్ కపుల్ అంటూ పంచ్ వేసింది.ఆ తర్వాత నీకు గడ్డం ఉన్న బాయ్ ఇష్టమా లేక గడ్డం లేని బాయ్స్ ఇష్టమా అని సుమ నవ్య స్వామిని అడగగా.

గడ్డం ఉంటేనే బాగుంటారు అంటూ రవి కృష్ణ ను చూస్తూ సమాధానం చెప్పింది నవ్య స్వామి.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో కి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ జనవరి 29న ప్రసారం కానుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube