రవికృష్ణ నా పిల్లల్ని చూసుకుంటున్నారని చెప్పిన నవ్యస్వామి.. రవితో రిలేషన్ ఇదేనంటూ?

సీరియళ్ల ద్వారా, సినిమాల ద్వారా, టీవీ షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన సెలబ్రిటీలలో నవ్యస్వామి( Navya Swamy ) ఒకరు.ఇంటింటి రామాయణం( Intinti Ramayanam ) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవ్యస్వామి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Navya Swamy Comments About Relationship With Ravi Krishna Details,  Navya Swamy,-TeluguStop.com

రవికృష్ణతో( RaviKrishna ) ఉన్న రిలేషన్ షిప్ గురించి కూడా నవ్యస్వామి స్పందించి క్లారిటీ ఇచ్చారు.బాల్యంలో చాలా తింగరి పనులు చేశానని ఆమె అన్నారు.

నేను 17 సంవత్సరాల వయస్సులో పార్ట్ టైమ్ జాబ్ తో కెరీర్ ను మొదలుపెట్టానని అప్పటినుంచి ఇప్పటివరకు ఇంట్లో నుంచి రూపాయి కూడా తీసుకోలేదని నవ్యస్వామి పేర్కొన్నారు.సీరియళ్లలో చేస్తే తెలుగు వచ్చేస్తుందని నేను తెలుగమ్మాయి అయిపోయానని ఆమె వెల్లడించారు.

నేను ఇన్నోసెంట్ అని అయితే ఇన్నోసెంట్ గా ఉండకూడదని నవ్యస్వామి కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Navya Swamy, Navyaswamy, Ravikrishna, Serialactress-Movie

ఎక్కడికి వెళ్లినా అమాయకమైన పాత్రలు దొరుకుతున్నాయని రౌడీ, మాస్ రోల్స్ చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు.గంగవ్వతో పని చేయడం మంచి అనుభవం అని నవ్యస్వామి అన్నారు.రాహుల్ పాత్ర కొంచెం కొత్తగా ఉంటుందని నవ్యస్వామి తెలిపారు.

రవికృష్ణతో రిలేషన్ షిప్ గురించి నవ్య స్పందిస్తూ ఆ కామెంట్లపై ఏం ఫీల్ అవ్వాలో కూడా నాకు అర్థం కాదని కామెంట్లు చేశారు.

Telugu Navya Swamy, Navyaswamy, Ravikrishna, Serialactress-Movie

రవికృష్ణ మంచి ఫ్రెండ్ అని కొందరైతే మీ భర్త రాలేదా అని అడుగుతారని అలా అడిగితే రవి రాలేదని పిల్లల్ని చూసుకుంటున్నాడు అని చెప్పానని ఆమె పేర్కొన్నారు.హిట్ కపుల్ కాబట్టి మా గురించి అలా ప్రచారం జరుగుతుందని నవ్యస్వామి అన్నారు.పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచించలేదని ఆమె పేర్కొన్నారు.

నా సెలబ్రిటీ క్రష్ అంటే విజయ్ దేవరకొండ ఇష్టమని ఆమె తెలిపారు.ఇన్ స్టాగ్రామ్ లో ఐ లవ్ యూ, ప్లీజ్ మ్యారీ మీ అనే మెసేజ్ లు వస్తాయని నవ్యస్వామి పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube