నవరాత్రులలో ఉపవాసం ఉంటున్నారా... అయితే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి?

హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించే నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 7వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

 Navratri 2021 Do And Do Not While Fasting During The Festival Know How To, Navra-TeluguStop.com

ఈ నవరాత్రి ఉత్సవాల కోసం ఇప్పటికే అమ్మవారి ఆలయాలన్నీ ముస్తాబవుతున్నాయి.ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తూ తమని కాపాడమని భక్తులు వేడుకుంటారు.

ఈ క్రమంలోనే చాలా మంది భక్తులు ఉపవాస దీక్షలతో అమ్మవారికి పూజలు చేయడం మనం చూస్తున్నాము.అయితే అమ్మవారికి పూజలు చేసేటప్పుడు కొన్ని నియమనిష్టలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.

మరి నవ రాత్రి సమయాలలో ఏ విధమైనటువంటి నియమ నిష్టలు పాటించాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేవీ నవరాత్రులను అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలి కనుక ప్రతిరోజూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజగదిని ఎంతో చక్కగా అలంకరించుకోవాలి.

నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారిని ప్రతిష్టించే సమయంలో కలశస్థాపన సరైన ముహూర్తంలోనే ఆచారాల ప్రకారం చేయాలి.కలశం ఏర్పాటు చేసిన తర్వాత నవరాత్రులు పూర్తయ్యేవరకు ప్రతిరోజు రెండు సార్లు నెయ్యితో దీపారాధన చేయాలి.

పూజ అనంతరం అమ్మవారి శ్లోకాలు మంత్రాలను చదవాలి.ఉపవాసం చేసే వారు ఉపవాసం ఆచారాలను పాటిస్తూ కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.

Telugu Navratri, Dasara Festival, Devi Navratri, Pooja-Telugu Bhakthi

నవరాత్రుల సమయంలో కలశం ముందు అఖండ దీపం వెలిగిస్తే పొరపాటున కూడా అఖండ దీపాన్ని ఆర్పకూడదు.నవరాత్రి పూజలు చేసే వాళ్ళు ఎలాంటి పరిస్థితులలో కూడా జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం చేయకూడదు.ఇతరులపై కోపాన్ని ప్రదర్శించి వారితో తగాదాలు పడకుండా ఎంతో శాంతియుతంగా ఉండాలి.ముఖ్యంగా మద్యం మాంసాహార పదార్థాలకు దూరంగా ఉండాలని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube