ఈ రాజకీయ నాయకురాలు ఒకప్పటి తెలుగు హీరోయిన్ మీకు తెలుసా..?

తెలుగులో ప్రముఖ దర్శకుడు ఈ. శ్రీనివాస్ దర్శకత్వం వహించిన “శ్రీను వాసంతి లక్ష్మి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన నటి “నవనీత్ కౌర్” తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Navneet Kaur, Young Politician, Former Telugu Heroine, Telugu Film Industry, Mah-TeluguStop.com

అయితే ఈమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ, అల్లరి నరేష్, జగపతి బాబు తదితర స్టార్ హీరోల చిత్రాలలో నటించినప్పటికీ ఆమె పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపుకి నోచుకోని లేకపోయింది.
  దీంతో ఇక చేసేదేమీ లేక ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో మహారాష్ట్ర రాష్ట్రంలో  2014 వ సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసింది.

అయితే ఈ ఎన్నికల్లో ఆమె దాదాపుగా లక్షా  30 వేల ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలైంది.

అయినప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి ప్రజల మధ్య లోకి వెళ్లి వారి సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం చేసింది.

 దీంతో  గత సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తన స్వస్థలం అయినటువంటి అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు 45 వేల ఓట్ల మెజారిటీతో పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందింది. దీంతో ప్రస్తుతం నవనీత్ కౌర్ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తనదైన శైలిలో దూసుకు పోతోంది.

అంతేగాక ఒక పక్క కుటుంబ బాధ్యతలు చక్కబెడుతూనే మరో పక్క ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య కాలంలో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడు  నవనీత్ కౌర్ కి సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె తన రాజకీయ జీవితం కారణంగా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

ఏదేమైనప్పటికీ సినిమా జీవితంలో పెద్దగా విజయం సాధించలేక పోయిన నవనీత్ కౌర్ రాజకీయాల్లో మాత్రం తన వ్యూహాలతో మంచి విజయం సాధించిందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube