నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు విడుదల అయ్యేది అప్పుడే?

గత ఏడాది తెలుగులో వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో బెస్ట్ యాక్టర్ గా గుర్తింపు పొందిన నవీన్ పొలిశెట్టి మంచి విజయాన్ని సాధించుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో తొలిసారిగా హీరోగా నటించిన నవీన్ కు అవార్డు కూడా దక్కింది.

 Naveen Polishetty Jathirathnalu Film Will Be Release-on-datenaveen Polishetty- J-TeluguStop.com

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా మరో సినిమా జాతిరత్నాలు లో నటించాడు‌.

గత ఏడాది హిందీలో చిచోరే సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు.

నవీన్ పొలిశెట్టి సినిమాల కంటే ముందు యూట్యూబ్ లో వీడియోలను చేసేవారు.అంతేకాకుండా కొన్ని చిత్రాలలో కొన్ని పాత్రల్లో నటించాడు.

కాగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా లో కామెడీ టైమింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా వల్ల యూత్ కు నవీన్ పట్ల అభిమానం పెరిగింది.ఈ సినిమా విజయంతో అదే తరహాలో జాతి రత్నాలు సినిమా లో నటించగా ఈ సినిమాలో అదే తరహా కామెడీతో అందించినట్లు తెలుపుతున్నారు సినీ నిర్మాతలు.

ఈ సినిమా గురించి చిత్ర నిర్మాతలు ఓ విషయాన్ని తెలుపగా ఈ సినిమా అవుట‌్ ఫుట‌్ చాలా బాగా వచ్చిందని తెలిపారు.ఇదిలా ఉంటే నవీన్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న బాలయ్య సినిమాలో ఓ పాత్రలో నటించనున్నట్లు వార్తలు రాగా.

అవి కేవలం పుకారు అని తెలిపాడు.కాగా జాతిరత్నాలు సినిమా గురించి సినీ నిర్మాతలు అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.ఈ సినిమా విడుదలకు డేట్ ను ఫిక్స్ చేశారని తెలపగా.మార్చి 11న ఈ సినిమా విడుదల అవ్వనుందని చిత్ర బృందం తెలిపింది.

ఈ సినిమా కూడా నవీన్ కు విజయాన్ని అందిస్తే.మరింత క్రేజీ తో ముందుకు పోయే అవకాశం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube