ఎందుకు డిలీట్‌ చేశార అయ్యా.. మళ్లీ ట్రెండ్‌ అవుతున్న జాతి రత్నాలు

ఏ ముహూర్తాన జాతి రత్నాలు మొదలు పెట్టారో కాని అన్ని విధాలుగా ఆ సినిమాకు లాభమే అనడంలో సందేహం లేదు.అయిదు కోట్లకు అటు ఇటుగా ఈ సినిమా ను నిర్మించి ఉంటారు.

 Naveen Polishetty Jathi Ratnalu Movie Deleted Video Trending In Youtube , Anudee-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయినట్లుగా అధికారికంగా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా యూట్యూబ్‌ వీడియోలు గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతూ మిలియన్‌ ల కొద్ది వ్యూస్ ను దక్కించుకుంటూనే ఉంటున్నారు.

ప్రమోషనల్‌ వీడియోలు, టీజర్‌, ట్రైలర్‌, తాజాగా డిలీటెడ్‌ సీన్స్ అంటూ జాతిరత్నాలను రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.ఇటీవల జాతి రత్నాలు మేకింగ్‌ వీడియోను షేర్‌ చేయగా అది దాదాపుగా నాలుగు అయిదు రోజుల పాటు యూట్యూబ్‌ లో ట్రెండ్డింగ్‌ లో నిలిచింది.

ఇప్పుడు డిలీటెడ్‌ సీన్స్‌ ను కూడా తీసుకు వచ్చారు.ఈ సీన్స్ కూడా ట్రెడ్డింగ్‌ లో నిలిచాయి.

జాతి రత్నాలు నుండి డిలీట్‌ చేసిన కొన్నిఫన్నీ సీన్స్‌ ను ఎందుకు డిలీట్‌ చేశార అయ్యా అంటూ టైటిల్‌ పెట్టి విడుదల చేశారు.సినిమా చూసిన వారికి ఆ సన్నివేశాలు అర్థం అవుతాయి.

తెగ నవ్విస్తున్నాయి.సోషల్‌ మీడియాలో ఈ వీడియోలో ట్రెండ్డింగ్‌ లో నిలిచింది.వకీల్‌ సాబ్‌ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక వీడియోలు రావడం వల్ల నె.4 కు ఈ వీడియో చేరింది.లేదంటే నెం.1 లేదా 2 లోనే ఉండేది.ఈ డిలీటెడ్‌ వీడియోలు ఇప్పటికే దాదాపుగా మూడు మిలియన్ ల వ్యూస్‌ ను దక్కించుకుంది.రికార్డు బ్రేకింగ్‌ వ్యూస్‌ ను దక్కించుకుంటూ దూసుకు పోతున్న జాతి రత్నాల వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

నవీన్‌ పొలిశెట్టి హీరోగా ఫరియా హీరోయిన్‌ గా నటించిన ఈ సినిమా లో కీలక పాత్రలను కమెడియన్స్‌ ప్రియదర్శి మరియు రాహుల్‌ రామకృష్ణలు నటించారు.అనుదీప్‌ దర్శకత్వంలో మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube