ఇటీవలే నూతన దర్శకుడు అనుదీప్ కె.వి దర్శకత్వం వహించిన జాతి రత్నాలు చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.
ఈ చిత్రంలో “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నవీన్ పోలిశెట్టి, ప్రముఖ కమెడియన్లు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఫరీయ అబ్దుల్లా, బ్రహ్మాజీ, మురళీ శర్మ బ్రహ్మానందం” తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే చిన్న తరహా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది.
కాగా తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు అనుదీప్ కె.వి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
అయితే ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే యాంకర్ ఎందుకు అనుదీప్ చాలా సైలెంట్ గా ఉంటాడని ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని ఇందుకు గల కారణాలు తెలియజేయాలని అడిగింది….దీంతో అనుదీప్ ఈ విషయంపై స్పందిస్తూ తాను కొత్తవాళ్లతో పెద్దగా మాట్లాడనని అందువల్లనే చాలా సైలెంట్ గా ఉంటానని చెప్పుకొచ్చాడు.
దీంతో యాంకర్ మరి క్యాష్ షోలో అంతగా రచ్చ చేశారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా అనుదీప్ ఈ విషయంపై మాట్లాడుతూ తనకి ఈవెంట్లు, షోలలో పాల్గొనడం పెద్దగా ఇష్టం ఉండదని కానీ జాతి రత్నాలు చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు నలుగురు చిత్ర యూనిట్ సభ్యులు కావాలని చెప్పడంతో తానూ క్యాష్ షో కి వెళ్లాల్సి వచ్చిందని అలాగే తన తోటి నటీనటులు కూడా ఆ షోలో పాల్గొనడంతో అలా సరదాగా గడిచిపోయిందని తెలిపాడు.అయితే క్యాష్ ప్రోగ్రాం లో పాల్గొనే వారం రోజుల ముందు నవీన్ పోలిశెట్టి 11 సంవత్సరాలుగా ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్క చనిపోయిందని దాంతో నవీన్ ఒక్కసారిగా చాలా డిప్రెషన్ లోకి వెళ్లాడని కూడా తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా గతంలో అనుదీప్ దర్శకత్వం వహించిన “పిట్టగోడ” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని దాంతో ఈ ఫెయిల్యూర్ తో చాలా పాఠాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.అలాగే జాతి రత్నాలు చిత్ర కథని విన్నటువంటి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నాగ అశ్విన్ తానే నిర్మించడానికి ముందుకు వచ్చి చాలా సహాయం చేశాడని కూడా తెలిపాడు.
కాగా తన తదుపరి చిత్రం “వైజయంతి మూవీస్ బ్యానర్ లో” చేయనున్నట్లు కూడా తెలిపాడు.