రెమ్యునరేషన్ పెంచిన నవీన్ పోలిశెట్టి... అయినా ఫుల్ డిమాండ్

జాతిరత్నాలు సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి.ఈ కుర్ర హీరో ఒక్కసారిగా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు.

 Naveen Polishetty Increase His Remuneration, Jathi Rathnalu Movie, Anushka Shett-TeluguStop.com

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హీరోగా మొదటి సక్సెస్ కొట్టిన నవీన్ అంతకంటే ముందుగానే లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో నటుడుగా తెరంగేట్రం చేశాడు.మహేష్ బాబు వన్ మూవీలో నటించాడు.

అలాగే హిందీలో కూడా ఓ రెండు సినిమాలలో నటించాడు.అయితే హీరోగా ఏజెంట్ సినిమాతో అతనికి బ్రేక్ వచ్చింది.

దాని తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ జాతి మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్నాడు.టాలెంటెడ్ హీరో అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.

ఈ నేపధ్యంలో ఇప్పుడు ఈ కుర్ర హీరోకి వరుస అవకాశాలు వస్తున్నాయి.నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చి నవీన్ తో సినిమాలు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

అలాగే దర్శకులు కూడా డిఫరెంట్ కథలతో నవీన్ దగ్గరకి వస్తున్నారు.

Telugu Anushka Shetty, Jathi Rathnalu, Tollywood-Movie

ఇదిలా ఉంటే ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి అనుష్కకి జోడీగా ఓ కొత్త సినిమా ఒకే చేశాడు.రారాక్రిష్నయ్య ఫేమ్ మహేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంచి ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగిపోయాయి.ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నిర్మాతలు నవీన్ కి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

దీంతో ఒక్కసారిగా వచ్చిన క్రేజ్ తో వస్తున్న సొమ్ముని క్యాష్ చేసుకోవడంతో పాటు నెక్స్ట్ సినిమాల విషయంలో ఇదే రెమ్యునరేషన్ ని ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తుంది.స్టార్ ఫ్యామిలీల నుంచి వస్తున్న హీరోలకి ఎలాంటి క్రేజ్ లేకపోయినా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు ఇలాంటి టాలెంటెడ్ హీరోలు సక్సెస్ ని ఉపయోగించుకొని డిమాండ్ చేస్తే తప్పేంటి అనే మాట ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube