ఏజెంట్ హీరో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్  

Naveen Polishetty Busy With Four Projects-

నేటితరం యువ హీరోలు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకోవడం కంటే స్లోగా ఒక కాన్ఫిడెంట్ హిట్ అందుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు.ఫస్ట్ ఆడియెన్స్ ని మెప్పించగలిగితే నెక్స్ట్ అవకాశాలు వాటంతట అవే వస్తాయని నిరూపిస్తున్నారు.ప్రస్తుత యువ హీరో నవీన్ పోలిశెట్టి కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాడు.

Naveen Polishetty Busy With Four Projects- Telugu Tollywood Movie Cinema Film Latest News Naveen Polishetty Busy With Four Projects--Naveen Polishetty Busy With Four Projects-

అసలు మ్యాటర్ లోకి వెళితే.ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టికి ఇప్పుడు కాస్త హై లెవెల్ టెక్నీషియన్స్ తో అవకాశాలు అందుతున్నాయి.

అయితే కథలను ఎంచుకోవడంలో కూడా మనోడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.వెంటనే ఒప్పుకోకుండా ముందు కథకు తన పాత్ర ఎంతవరకు న్యాయం చేస్తుంది అని ఆలోచించి ఆ తరువాత ఒకే చేస్తున్నాడట.

రీసెంట్ గా ఈ యువ హీరో నాలుగు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అందులో వైజయంతి లాంటి బడా ప్రొడక్షన్ కి సంబంధించిన సినిమా కూడా ఉంది.

ఇక పిట్టగొడ దర్శకుడు అనుదీప్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఈ యంగ్ హీరో ఒప్పుకున్నాడు.అలాగే మరో రెండు ప్రాజెక్టులు ఒకే చేసినప్పటికీ అవి ఇంకా సెట్స్ పైకి రాలేవు.త్వరలోనే వాటిపై కూడా ఒక అనౌన్స్మెంట్ రానుంది.