మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి... అసలేం చేస్తున్నారు భయ్యా?

జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి స్థాయి అమాంతం పెరిగింది.ఆయన నుండి సినిమా వస్తుంది అంటే వంద కోట్ల సినిమా అన్నట్లుగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

అలాంటి సమయంలో నవీన్‌ పొలిశెట్టి( Naveen Polishetty ) తన తదుపరి సినిమా ను అనుష్క( Anushka Shetty ) తో చేయడంతో అంతా కూడా అవాక్కయ్యారు.అనుష్క వంటి సీనియర్ హీరోయిన్ తో నవీన్ మిస్‌ శెట్టి.

మిస్టర్‌ పొలిశెట్టి సినిమా ఏంట్రా బాబు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా కొందరు మాత్రం వావ్‌ అంటూ ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.

సరే ఏదో ఒక సినిమా నవీన్‌.అనుష్క ల కాంబోలో సినిమా వస్తే బాగుంటుంది కదా అనుకుంటే ఇప్పుడేమో సినిమా విడుదల గురించి పెద్ద టెన్షన్‌ అయింది.వీరి కాంబో సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

గత ఏడాది కాలంగా సినిమా ను వాయిదా వేస్తూ వస్తున్నారు.ఇప్పుడు సినిమా ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.

కానీ ఇప్పుడు మాత్రం సినిమా ను ప్రమోట్‌ చేయకుండానే విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.ఆగస్టు 4వ తారీకున సినిమా ను విడుదల చేయాలని భావించారు.

విడుదలకు కనీసం రెండు వారాల సమయం కూడా లేదు.అయినా కూడా ఇప్పటి వరకు అనుష్క ప్రమోషన్‌ లో ఎక్కడ కనిపించలేదు.

యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ను నిర్మిస్తున్నారు.సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లో ఉన్న అనుష్క అభిమానులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.కానీ ఈ సినిమా కు అసలు ప్రమోషన్‌ చేయడం లేదు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?

ఇప్పటి వరకు మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ( Miss Shetty Mr Polishetty )అనే టైటిల్‌ జనాల్లోకి వెళ్లలేదు.సినిమా గురించి టాక్‌ కనిపించడం లేదు.

Advertisement

ఇలాంటి సమయంలో ఎందుకు ప్రమోషన్ లేకుండా సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.వచ్చే వారంలో అయినా ప్రమోషన్ చేస్తారా లేదంటే సినిమా ను వాయిదా వేస్తున్నామని చెబుతారా అనేది చూడాలి.

తాజా వార్తలు