నా పెళ్లి ఫోటోలు చూసి కత్రినా, విక్కీ కుళ్ళుకోవాలి.. నవీన్ పొలిశెట్టి?

జాతి రత్నాలు సినిమా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు నవీన్ పొలిశెట్టి.ఇందులో నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.

 Naveen Polishetty Anaganaga Oka Raju Movie Title Teaser Out, Naveen Polishetty, Anaganaga Oka Raju Movie, Tollywood, Prabhas-TeluguStop.com

ఇది నవీన్ పోలిశెట్టి జాతిరత్నాలు సినిమా కంటే ముందుగా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతే కాకుండా మొదటి సినిమాతో తాను అంటే ఏంటో నిరూపించుకున్నాడు.

ఆ తర్వాత జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు.ఇకపోతే ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హోస్ట్ గా వ్యవహరించిన సంగతి మనందరికీ తెలిసిందే.

 Naveen Polishetty Anaganaga Oka Raju Movie Title Teaser Out, Naveen Polishetty, Anaganaga Oka Raju Movie, Tollywood, Prabhas-నా పెళ్లి ఫోటోలు చూసి కత్రినా, విక్కీ కుళ్ళుకోవాలి.. నవీన్ పొలిశెట్టి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పోస్ట్ గా వ్యవహరించి తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు.అంతే కాకుండా ఈవెంట్ లో భాగంగా కొందరిని ఒక ఆట ఆడుకున్నాడు.

ఇకపోతే నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.ఈ క్రమంలోనే నవీన్ పోలిశెట్టి తాజాగా హీరోగా నటించిన చిత్రం అనగనగా ఒక రాజు.

ఈ సినిమాకు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం తమన్‌ అందిస్తున్నారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్,పోర్చ్యూన్‌ 4 సినిమాస్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సంక్రాంతి పండుగ సందర్భంగా తాజాగా ఈ సినిమా టైటిల్ ను, టీజర్ ను రిలీజ్ చేశారు.అనగనగా ఒక రాజు అంటూ డిలీట్ చేసిన ఈ వీడియోలో రాజు గాడి పెళ్లి అంటూ నవీన్ పోలిశెట్టి చేసే సందడి మామూలుగా లేదు.

నవీన్ పోలిశెట్టి పెళ్లి సందర్భంగా చేస్తున్న సందడి చూస్తుంటే ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనర్ ఉండబోతోంది అర్థం అవుతోంది.ఇక రాజు గాడి పెళ్లి అంటే ఎలా ఉండాలి అంటూ తన డైలాగులతో, తన హంగులు ఆర్భాటాలతో నవ్వులు పూయిస్తున్నాడు.

అంతేకాకుండా రాజు గాడి పెళ్లి ఫోటోలు చూసి కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కూడా కుళ్ళు కోవాలి, సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలి అని చెప్పిన డైలాగ్ సరదాగా ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube