ఆ రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌ డౌన్‌ పొడిగింపు!

కరోనా వైరస్ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించి అతలాకుతలం చెయ్యడంతో ప్రజలు ఎవరును బయటకు రాకూడదు అని.కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు అంటే ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించింది.

 Odisha, Naveen Patnaik, Lockdown, Extended, Covid-19-TeluguStop.com

అయితే ఇన్ని రోజులు లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.

ఇంకా లాక్ డౌన్ ఎత్తి వెయ్యాల్సిన సమయం కూడా దగ్గర పడటంతో ప్రజలందరు కూడా లాక్ డౌన్ ఎత్తివేస్తారా? లేకపోతే పొడిగిస్తారా? అనే ఆలోచనలో ఉన్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కేసులు తగ్గకపోవడంతో ఒడిశా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది.

Telugu Covid, Extended, Lockdown, Naveen Patnaik, Odisha-

అంతేకాదు.రాష్ట్రంలో విద్య సంస్దలు 17వ తేదీ వరుకు తెరవం అని నవీన్ పట్నాయక్ ప్రకటించారు.ఇంకా మీడియాతో మాట్లాడిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఒడిశా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది అని, దేశ వ్యాప్తంగానూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్టు చెప్పారు.

కాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా లాక్‌డౌన్‌ పొడిగించాలి అని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.మరి కేంద్రం లాక్ డౌన్ పొడిగిస్తుందా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube