ఆ హీరో పుట్టిన రోజని ఇంటికి వెళితే... అంటూ ఎమోషనల్ అయిన జబర్దస్త్ నటుడు...

తెలుగు బుల్లితెర మీద ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ఎంతగా ప్రేక్షకులను అలరిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు తెలుగు సినిమా పరిశ్రమకి హీరోలుగా మరియు కమెడియన్ గా పరిచయమవుతున్నారు.

 Naveen, Jabardasth Comedian, Jr Ntr Friendship, Tollywood Hero, Tollywood-TeluguStop.com

అయితే జబర్దస్త్ షోలో అదిరే అభి స్కిట్ లో పొడవాటి గడ్డం మరియు బట్టతలతో కనిపిస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేటువంటి నవీన్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో నవీన్ ఒక పక్క జబర్దస్త్ స్కిట్లు చేస్తూనే మరో పక్క సినిమాల్లో అడపదడపా పాత్రను చేస్తున్నాడు.

అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన సినీ జీవితానికి సంబంధించినటువంటి పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో తాను తెలుగు సినీ పరిశ్రమలో ముగ్గురు హీరోలని అమితంగా అభిమానిస్తానని అందులో ఎక్కువగా నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా అభిమానిస్తానని తెలిపాడు.ముఖ్యంగా ఎన్టీఆర్ వ్యక్తిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని మరియు ఎన్టీఆర్ ఇతరులతో ప్రవర్తించే తీరు తనకు బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.

అయితే అందుకు సంబంధించిన ఒక ఈ విషయాన్ని కూడా తెలిపాడు.అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఒకరోజు ఇంటికి వెళ్లాలని, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి మేడ మీద ఉన్నారని తనని సెక్యూరిటీ సిబ్బంది అపుతుండగా వెంటనే జూనియర్ ఎన్టీఆర్ చూసి వారిని పైకి పంపించండని మరియు ఇంకెప్పుడు ఎప్పుడైనా సరే నవీన్ మరియు అతని స్నేహితులు వచ్చినప్పుడు ఆపద్దంటూ సెక్యూరిటీ సిబ్బందికి అని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన “స్టూడెంట్ నెంబర్ 1, సుబ్బు, అశోక్, రామయ్య వస్తావయ్య, అరవింద సమేత” తదితర చిత్రాల్లో తాను కూడా నటించానని కానీ ఆ చిత్రాల్లో తాను చేసినటువంటి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో తనని పెద్దగా గుర్తు పట్టారని చెప్పుకొచ్చాడు.అయితే ప్రస్తుతం నవీన్ జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పలు రకాల సినిమాలు, ఈవెంట్లు, షోలు అంటూ బాగానే సంపాదిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube