ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టారా..?  

naveen chandra rare photo goes viral in social media, Naveen Chandra, Aravindha Sametha Veer Ragava, Andhala Rakshashi, Telugu, Tamil. Hindhi, Marathi, Nenu Local - Telugu Andhala Rakshashi, Aravindha Sametha Veer Ragava, Marathi, Naveen Chandra, Nenu Local, Tamil. Hindhi, Telugu

అందాల రాక్షసి సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర.ఒకవైపు సినిమాల్లో హీరోగా నటిస్తూనే అరవింద సమేత వీర రాఘవ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు ఈ హీరో.

TeluguStop.com - Naveen Chandra Rare Photo Goes Viral In Social Media

సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో కెరీర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డ నవీన్ చంద్ర తను నటించిన పలు సినిమాలు హిట్ కావడంతో గుర్తింపుతో పాటు మంచిపేరును సంపాదించుకున్నాడు.

ఈ టాలీవుడ్ యంగ్ హీరో తన తల్లితో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

TeluguStop.com - ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తుపట్టారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తాజాగా ఒక టీవీ షోలో పాల్గొన్న నవీన్ చంద్ర ప్రేక్షకులకు తెలియని చాలా విషయాలను వెల్లడించారు.నవీన్ చంద్ర ఏడేళ్ల వయస్సులో ఉన్న సమయంలో తండ్రి చనిపోవడంతో బాగా ఏడ్చేశానని.

నాన్న ఉంటే తన విజయాలను చూసి సంతోషించేవారని.ప్రయోజకుడిని అయ్యానని ఆనందించే వారని చెప్పారు.

తండ్రి చనిపోయిన తరువాత ఆంజనేయ స్వామిని నమ్మడం మొదలుపెట్టానని అన్నారు.బాల్యంలో పెదాలపై గండు చీమ కుట్టిందని అప్పటినుంచి చీమను చూస్తే బాగా భయం వేసేదని తెలిపారు.

చిన్న ఎర్రచీమ గజగజా వణికించిందని.ఆ తర్వాత ఎక్కడ చీమలను చూసినా భయమేస్తుందని అన్నారు.

తాను హైదరాబాద్ లో పుట్టినా పెరిగింది మాత్రం బళ్లారిలోనేనని అన్నారు.

చిరంజీవికి తాను పెద్ద అభిమానినని ఆయనను చూసే డ్యాన్స్ నేర్చుకున్నానని చెప్పారు.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషలలో మాట్లాడతానని వెల్లడించారు.అన్న కె.ఎస్.ఆర్టీసీలో ఉద్యోగం చేస్తాడని నాన్న చనిపోయిన తర్వాత నాన్న ఉద్యోగం అన్నకు వచ్చిందని అన్నారు.ప్రజలందరికీ తాను నవీన్ చంద్రగా కంటే అందాల రాక్షసి సినిమాలో సూర్యగానే తెలుసని.ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందని అన్నారు.

#Tamil. Hindhi #Nenu Local #Marathi #Naveen Chandra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naveen Chandra Rare Photo Goes Viral In Social Media Related Telugu News,Photos/Pics,Images..