అప్పుడు అబ్బాయి.. ఇప్పుడు బాబాయి.. అదరగొడుతున్న ట్యాలెంటెడ్ హీరో!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమాల్లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు.కానీ ఈ సినిమా టీజర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Naveen Chandra In For Balakrishna Boyapati Sreenu, Naveen Chandra, Ntr, Aravinda-TeluguStop.com

ఇక ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మరో యంగ్ హీరో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తి ఇటీవల ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ పాత్ర కోసం తొలుత పోలిశెట్టి నవీన్ పేరు వినిపించినా, అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తేల్చి చెప్పాడు.దీంతో ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా ఈ పాత్రలో మరో యంగ్ హీరో నవీన్ చంద్ర నటించనున్నట్లు తెలుస్తోంది.గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రంలో నవీన్ చంద్ర పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఇలాంటి పాత్రే ఉండటంతో ఆయనను ఈ సినిమాలో తీసుకునేందుకు బోయపాటి శ్రీను ఆసక్తి చూపాడట.పాత్ర నచ్చడంతో నవీన్ చంద్ర కూడా వెంటనే ఓకే అన్నాడని తెలుస్తోంది.

మొత్తానికి అబ్బాయితో పోటీపడి నటించిన నవీన్ చంద్ర ఇప్పుడు బాబాయి సినిమాలో మరోసారి తన ట్యాలెంట్ చూపించేందుకు రెడీ అవుతున్నాడు.బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ నటిస్తోందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube