యూవీ క్రియేషన్స్ లో ఛాన్స్ కొట్టేసిన నవీన్ చంద్ర  

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న బిగ్ ప్రొడక్షన్ హౌస్ లలో యూవీ క్రియేషన్స్ కూడా ఒకటి.రన్ రాజా రన్ తో సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన యూవీ క్రియేషన్స్ తరువాత ప్రభాస్ తో మిర్చీ, సాహూ, ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలతో భారీ బడ్జెట్ తోనిర్మించింది.

TeluguStop.com - Naveen Chandra Next Movie With Uv Creations

బాహుబలి సినిమా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ ని చేస్తే ఆ ఇమేజ్ ని యూవీ క్రియేషన్స్ మరింత పెంచే ప్రయత్నం చేస్తుంది.ఇక ఈ బ్యానర్ లో ప్రభాస్ పెట్టుబడులు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ప్రభాస్ స్నేహితులే ఈ బ్యానర్ ని స్టార్ట్ చేయడం వలన ఈ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఇదిలా ఉంటే ఈ బ్యానర్ నుంచి నెక్స్ట్ ఇతర హీరోలతో పాటు, లో బడ్జెట్ సినిమాలని కూడా నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

TeluguStop.com - యూవీ క్రియేషన్స్ లో ఛాన్స్ కొట్టేసిన నవీన్ చంద్ర-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

చిన్న బడ్జెట్ సినిమాల కోసం వి సెల్యులాయిడ్స్ అనే కొత్త బ్యానర్ ని స్టార్ట్ చేశారు.ఈ బ్యానర్ నుంచి మొదటి సినిమా రాకేష్ వర్మ అనే కొత్త దర్శకుడుతో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం నవీన్ చంద్రని హీరోగా కన్ఫర్మ్ చేశారు.ఓ వైపు లో బడ్జెట్ సినిమాలతో హీరోగా నవీన్ చంద్ర తన కెరియర్ కొనసాగిస్తూ మరో వైపు స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు పెంచుకుంటున్నాడు.

ఇప్పటికే తమిళంలో ధనుష్ సినిమాలో విలన్ గా కోలీవుడ్ లోకి కూడా నవీన్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు.అలాగే అరవింద సమేత సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు.

నవీన్ చంద్ర చివరిగా భానుమతి రామకృష్ణ అనే సినిమాతో హిట్ కొట్టాడు.ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.

ఈ నేపధ్యంలో రాకేష్ వర్మ ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ కోసం నవీన్ చంద్రని హీరోగా తీసుకున్నాడని తెలుస్తుంది.డైరెక్టర్ ఛాయస్ ప్రకారం నవీన్ చంద్రకి యూవీ క్రియేషన్స్ కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

#Naveen Chandra #Darling Prabhas #UV Creations #Rakesh Varma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Naveen Chandra Next Movie With Uv Creations Related Telugu News,Photos/Pics,Images..