ఓటీటీకి వెళ్తున్న నవీన్ చంద్ర కొత్త సినిమా

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు నవీన్ చంద్ర.మొదటి సినిమాతోనే నటుడుగా ప్రూవ్ చేసుకున్న ఇతనికి తరువాత మంచి అవకాశాలు వచ్చిన వాటిలో గుర్తుంచుకునే స్థాయిలో సినిమాలు ఏవీ రాలేదు.

 Naveen Chandra New Movie Ready To Release On Ott, Tollywood, Telugu Cinema, Digi-TeluguStop.com

ఈ నేపధ్యంలో హీరో పాత్రలకే పరిమితం కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నవీన్ చంద్ర మెప్పిస్తున్నాడు.అతనిలో మంచి నటుడు ఉండటంతో ఎలాంటి పాత్రలో అయిన ఈజీగా పరకాయ ప్రవేశం చేసేస్తూ ఆ సినిమాలో తన మార్క్ కనిపించేలా చూసుకుంటున్నాడు.

అరవింద సమేత సినిమాలో నవీన్ చంద్ర చేసిన ఓబుల్ రెడ్డి పాత్ర అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.ఈ నేపధ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతను ఫుల్ బిజీ అయిపోయాడు.

మరో వైపు తమిళంలో పటాస్ అనే సినిమాలో ధనుష్ కి విలన్ గా నటించి మెప్పించాడు.

ఇదిలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న కూడా హీరోగా కూడా మధ్య మధ్యలో లో బడ్జెట్ సినిమాలు నవీన్ చంద్ర చేస్తున్నాడు.

ఈ మధ్యఅతను భానుమతి రామకృష్ణ అనే సినిమాలో హీరోగా చేశాడు.ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి కూడా రెడీ అయ్యింది.

ఈ సినిమాతో శ్రీకాంత్ అనే యువదర్శకుడు పరిచయం అవుతున్నాడు.ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ కాపీని హాట్ స్టార్ వారికి చిత్ర నిర్మాతలు చూపించడం జరిగిందని తెలుస్తుంది.

కాన్సెప్ట్ బాగుండటంతో వారు కూడా సినిమాని కొనడానికి రెడీ అయినట్లు సమాచారం.నిర్మాతలు, వారి మధ్య బేరం కుదిరితే వీలైనంత త్వరలో ఈ సినిమాని కూడా డైరెక్ట్ గా ఓటీటీ హాట్ స్టార్ లో చూసే అవకాశం ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube