బాలయ్య సినిమాలో బాల్రెడ్డి.. సేమ్ టు సేమ్?  

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసింది.

TeluguStop.com - Naveen Chandra Negative Role In Balakrishna Movie

ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడంతో ఈ సినిమా గురించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులు తప్పకుండా ఫాలో అవుతున్నారు.కాగా ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో పాత్రకు సంబంధించిన వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

TeluguStop.com - బాలయ్య సినిమాలో బాల్రెడ్డి.. సేమ్ టు సేమ్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

పలు విలక్షణ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నవీన్‌చంద్ర ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఓ మినిస్టర్ కొడుకుగా ఆయన మనకు కనిపిస్తాడట.గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రంలో జగపతిబాబు కొడుకు బాల్రెడ్డి పాత్రలో నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఆయనకు మంచి పేరును తీసుకొచ్చింది.ఇక ఈ సినిమాలోనూ అలాంటి పాత్రతో మనకు కనిపించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో.

కాగా బాలయ్యతో నవీన్ చంద్ర సీన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక బాలయ్య ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య డైలాగులు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.ముఖ్యంగా రైతు పాత్రలో బాలయ్య పర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్‌గా నిలవనుందట.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త బ్యూటీని తీసుకోనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.బోయపాటి మార్క్ మాస్ అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు, ఈ సినిమాతో ఆయన బౌన్స్ బ్యాక్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

#Naveen Chandra #Balakrishna #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు