డిజిటల్ దునియా లో ఎంటర్ అవుతున్న నవదీప్, ఇక్కడ కాదు  

Navdeep Team Up With Sunny Leone For Web Series-navadeep And Allu Arjun,navdeep

టాలీవుడ్ నటుడు నవదీప్ ఒకప్పుడు హీరో గా నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన నటనతో పలువురి ప్రసంశలు అందుకుంటున్నాడు.ప్రస్తుతం కూడా నవదీప్ స్నేహితుడు అల్లు అర్జున్ తో కలసి ‘అల వైకుంఠపురంలో’ నటిసున్న విషయం తెలిసిందే.

Navdeep Team Up With Sunny Leone For Web Series-navadeep And Allu Arjun,navdeep Telugu Tollywood Movie Cinema Film Latest News Navdeep Team Up With Sunny Leone For Web Series-navadeep And Allu Arjun N-Navdeep Team Up With Sunny Leone For Web Series-Navadeep And Allu Arjun

అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకుండానే నవదీప్ కు ఒక బంపర్ ఆఫర్ వచ్చింది.ఇదేదో టాలీవుడ్ నుంచి కాదు ఏకంగా బాలీవుడ్ నుంచి నవదీప్ కు జాక్ పాట్ తగిలింది.

ఈ ఆఫర్ వచ్చింది ఆషామాషీ కంపెనీ నుంచి కాదు.బాలీవుడ్ లో ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ బ్యానర్ లో ఛాన్స్.

Navdeep Team Up With Sunny Leone For Web Series-navadeep And Allu Arjun,navdeep Telugu Tollywood Movie Cinema Film Latest News Navdeep Team Up With Sunny Leone For Web Series-navadeep And Allu Arjun N-Navdeep Team Up With Sunny Leone For Web Series-Navadeep And Allu Arjun

ఈ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.

  ఈ బ్యానర్ లో వచ్చిన పలువురు నటులు స్టార్స్ గా ఇండస్ట్రీ లో నిలిచిపోయారు అని చెప్పాలి.రాజ్ కుమార్ రావ్.లాంటి మామూలు నటుడిని పెద్ద స్టార్ ని చేసింది ఈ సంస్థనే.

యూత్ ఫుల్ కంటెంట్.హాట్ స్పైసీ సినిమాలకే కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ సంస్థ నుంచి నవదీప్ కు ఆఫర్ లభించింది.

ఈ సంస్థ గత కొంత కాలంగా ఎరోటిక్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది.తాజాగా తను నిర్మించిన `రాగిణి ఎంఎంఎస్`ని వెబ్ సిరీస్ గా అందించబోతున్న నేపథ్యంలో సీజన్ 2ని సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఇందులో నవదీప్ కు కూడా ఒక కీలక పాత్ర చేసే అవకాశం లభించినట్లు తెలుస్తుంది.

దీంతో సినిమా ప్రపంచం నుంచి నవదీప్ డిజిటల్ దునియాలోకి ఎంటరవుతున్నాడు.గతంలో తెలుగులో యప్ టీవీ సిరీస్ లోనూ నటించిన అనుభవం ఉన్న నవదీప్ ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మంచి పేరున్న ఆల్ట్ బాలాజీ సంస్థలో తనకు ఛాన్స్ వచ్చింది అని తెలియగానే నవదీప్ కూడా వెంటనే అంగీకరించాడట.

హారర్ కంటెంట్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్నారు.

దీన్ని సౌత్ లోనూ మార్కెట్ చేయాలంటే సౌత్ కు సంబంధించిన నటీనటులు వుండాలన్న ఆలోచనలో భాగంగానే నవదీప్ ని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.పాపం టాలెంట్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు నవదీప్ కు చెప్పుకోదగ్గ చిత్రాలు మాత్రం లభించలేదు.

మరి ఈ వెబ్ సిరీస్ తో అయినా అతడు మంచి పాపులర్ అవుతాడేమో చూడాలి.

.

తాజా వార్తలు