పెళ్లి లొల్లి వద్దంటున్న హీరో

టాలీవుడ్ యంగ్ హీరోల్లో చాలా మంది తమ కెరీర్ సెట్ చేసుకోవడంతో పాటు పెళ్లి చేసుకుని సెటిల్ అవుతున్నారు.ఈ జాబితాలో స్టార్ హీరోల దగ్గర్నుండి మీడియం రేంజ్ హీరోల వరకు ఉన్నారు.

 Navdeep Not Interested In Marriage As Of Now, Navdeep, Marriage, Tollywood News,-TeluguStop.com

అయితే ఓ యంగ్ హీరో మాత్రం పెళ్లి మాట ఎత్తితే గుర్రుమంటున్నాడు.‘జై’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నవదీప్, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు.

ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న నవదీప్, టాలీవుడ్‌లోని బ్యాచ్‌లర్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు.
కాగా టాలీవుడ్‌లో అల్లు అర్జున్, రానా దగ్గుబాటి వంటి స్టార్ హీరోలకు మంచి స్నేహితుడైన నవదీప్ పెళ్లి గురించి ఆయా హీరోల అభిమానులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే అల్లు అర్జున్ ఇప్పటికే పెళ్లి చేసుకుని సెటిల్ కాగా, రానా దగ్గుబాటి రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో నవదీప్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని తెలుగు ప్రేక్షకులు ఆయన్ను అడుగుతున్నారు.

దీంతో పెళ్లి లొల్లి పెడుతున్న ప్రేక్షకులను చూసి నవదీప్ చిరాకు పడుతున్నారు.తనను పెళ్లి గురించి అడిగి ఇబ్బంది పెట్టొద్దంటూ ఆయన అభిమానులు కోరుతున్నారు.

ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని నవదీప్ తేల్చి చెప్పాడు.కాగా మిగతా హీరోల మాదిరిగా తనకు పెళ్లిపై పెద్దగా ఆసక్తి లేదని, అందుకే తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ఈ హీరో.

ఇక తనకు వస్తున్న పాత్రలకు పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తున్నాని నవదీప్ తెలిపాడు.అటు పలు టీవీ షోల్లో కూడా నవదీప్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

మరి ఈ హీరో పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.ఏదేమైనా నవదీప్ పెళ్లి విషయం మరోసారి లైమ్‌ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడంతో నెటిజన్లు ఈ విషయంపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube