నేను అలా మారడానికి కారణం బన్నీయే అంటోన్న నవదీప్

టాలీవుడ్‌లో జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నవదీప్, ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాలని చూశాడు.కానీ హీరోగా అదరగొట్టే సినిమా నవదీప్ కెరీర్‌లో పడకపోవడంతో ఈ హీరో క్యారెక్టర్ పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నాడు.

 Navdeep Inspired From Allu Arjun, Navdeep, Allu Arjun, Six Pack, Arya 2, Ala Vai-TeluguStop.com

కాగా ఈ మధ్యలో చాలా సెలెక్టివ్‌గా క్యారెక్టర్ పాత్రలతో పాటు అడపా దడపా హీరోగా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.

అయితే ఓ విషయంలో పూర్తిగా మారిన నవదీప్, తాను ఈ పరిస్థితిలో ఉండటానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కారణమంటూ చెప్పుకొచ్చాడు.

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన దేశముదురు చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించాడు.ఇక ఆ తరువాత తన బాడీని ఫిట్‌గా మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు.

ఈ క్రమంలోనే బన్నీని చూసి తాను కూడా ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాడట నవదీప్.

అందుకే ఇటీవల తాను ఫిట్‌నెస్‌ విషయంలో చాలా కష్టపడుతున్నానని చెప్పుకొచ్చాడు.

ఇటీవల సిక్స్ ప్యాక్ బాడీతో నవదీప్ కనిపించడానికి ముఖ్య కారణం బన్నీ అని చెప్పుకొచ్చాడు.ఇక బన్నీతో తనకు మంచి స్నేహం ఉండటంతో అతడితో వరుగా సినిమాలు చేస్తున్నానని నవదీప్ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube