తనకి ఎదురైన ట్రాఫిక్ సిగ్నల్ పై నవదీప్ ఫన్నీ ట్వీట్.! కామెంట్స్ కూడా హైలైట్!       2018-06-29   00:01:44  IST  Raghu V

‘బిగ్‌బాస్’ తెలుగు మొదటి సీజన్ చూసినవారికి హీరో నవదీప్‌ సరదా వ్యక్తిత్వం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలు లేకున్నా సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడూ.. అభిమానులను పలకరిస్తూ నవ్విస్తుంటాడు నవదీప్. తాజాగా, నవదీప్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ ‘ట్రాఫిక్ సిగ్నల్’ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

-

ట్రాఫిక్‌ సిగ్నల్‌పై హీరో నవదీప్‌ సెటైర్‌ వేశాడు. గత రాత్రి ఓ ప్రాంతంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఫొటోను తీశాడు. దాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ.. ‘స్టాప్‌ బ్లేమింగ్‌ మి ఫర్‌ నాట్‌ హవింగ్‌ ఎ డైరెక్షన్‌ ఇన్‌ లైఫ్‌’ ( ‘జీవితంలో ఎలాంటి డైరెక్షన్ లేకుండా.. నన్ను అవమానించడం మానండి’) అని పోస్టు చేశాడు. అంతేకాక ఓ పిక్‌ను కూడా జత చేశాడు. నవదీప్‌ పెట్టిన పిక్‌లో రెడ్‌లైట్‌ ఆన్‌లో ఉంది. దాంతోపాటు స్ట్రెయిట్‌, లెఫ్ట్‌ సిగ్నల్స్‌ను కూడా చూపిస్తోంది.

దీనిని చూసిన నెటిజన్లు కూడా అంతే సరదాగా స్పందిస్తున్నారు. ‘భయానకం’గా ఉంది అని ఒకరు.. ‘ఏ ఏరియా’ అని ఒకరు.. ’గుడ్ వన్’ అని ఒకరు.. ‘అన్నా ఒకసారి ఆగి… లెఫ్ట్‌కి వెళ్లి.. అప్పుడు రైట్‌కి వెళ్లు’ అని మరొకరు సూచిస్తూ సరదా సరదా కామెంట్స్ పెడుతున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.