సోనూసూద్ లాంటి వాడే చేయలేకపోతున్నాడు.. నేను ఏం చేస్తానంటున్నా నవదీప్!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని ఎంతగా వణికిస్తుందో అందరికి తెలిసిందే.ఇప్పటికే ఎన్నో కేసులు పెరుగుతూ.

 Actor Navdeep About Sonusood Help In Covid Crisis, Oxygen, Navdeep, Sonu Sood, C-TeluguStop.com

ఎన్నో ప్రాణాలు వదులుతున్న తరుణంలో గత ఏడాది నుండే ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది ఈ వైరస్.ఇక ఆ సమయంలో బాధితులను కాపాడడానికి రంగంలోకి దిగిన సినీనటుడు సోనుసూద్.

ఎంతో సేవ చేస్తూ ప్రజల్లో దేవుడుగా నిలిచాడు.


నేనున్నా అంటూ ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ.

చిక్కుకున్న వలస కార్మికుల నుండి ఇప్పటికీ తన వంతు సహాయాన్ని చేస్తూనే ఉన్నాడు.విద్యార్థులకు, వైద్యులకు, ఉపాధి కూలీలకు ఇలా ఎంతో మందికి తమకు కావాల్సిన విధంగా సహాయం అందిస్తూ వారి గుండెల్లో నిలిచాడు.

ఇప్పటి వరకు ఏ స్టార్ సెలబ్రిటీ కూడా ఇంత సహాయానికి ముందుకు రాకపోగా.కేవలం సినిమాలలో విలన్ గా ఉన్న సోనూసూద్.

హీరోగా ముందుకు వచ్చాడు.ఇదిలా ఉంటే ఇప్పటివరకే కాకుండా ఇప్పుడు కూడా మళ్లీ చేతులు చాచిన వారికి సహాయం అందిస్తూనే ఉన్నాడు.

కానీ ఇటీవలే ఓ వ్యక్తికి ఆక్సిజన్ కొరత ఉండటంతో తన వంతు సహాయం చేసినా కూడా ప్రాణాలు అందించలేకపోయాడు.దీనివల్ల ఎంతో బాధపడిన సోనూసూద్ గురించి తాజాగా సినీ నటుడు నవదీప్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.


ప్రస్తుత పరిస్థితులను బట్టి తన సోషల్ మీడియా వేదిక ద్వారా లైవ్ లోకి వచ్చిన నవదీప్.ప్రజలకు చేతనైన సాయం చేయండి అని కోరాడు.ప్రతి ఒక్కరు ఆర్థికంగా సాయం చేయడం కుదరదు అంటూ సోనూసూద్ లాంటి వాడే చేయలేకపోతున్నాడు.ఎంత చేసిన కొన్ని ప్రాణాలు పోతూనే ఉన్నాయి అంటూ అలా ఎవరి స్థాయికి తగ్గట్టు వారు సాయం చేయండి అని, తను కూడా ఎమర్జెన్సీ కి సంబంధించిన పోస్టులన్నీ షేర్ చేస్తున్నాను అంటూ తన వల్ల అయ్యేది అదే అంటూ.

చేయగలిగింది ఇదే అని చెప్పుకొచ్చాడు నవదీప్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube