రెండోరోజు అమ్మవారి అలంకారం.. పూజా విధానం..!

విజయ దశమి దేశ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే ఆశ్వీయుజ మాసంలో వచ్చే దేవి నవ రాత్రులను భక్తులు ఎంతో ఘనంగా జరుపు కుంటారు .

 Navaratri 2021 Second Day Puja And Prasadam And Which Color Dress For Maa Durga,-TeluguStop.com

దేవి నవరాత్రులలో భాగంగా మొదటిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శన మివ్వగా రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.నవరాత్రులలో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

నేడుఅమ్మవారిని ఎలా పూజించాలి ఏ విధమైనటువంటి వస్త్రాలు సమర్పించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

నవరాత్రులలో భాగంగా రెండోరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.

ఈ రోజు అమ్మవారిని తుమ్మి పూలతో అలంకరించి పూజ చేయాలి.అదేవిధంగా అమ్మవారికి బంగారు వర్ణపు వస్త్రాలను సమర్పించి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా సమర్పించాలి.

బాల త్రిపుర సుందరి అనగా.సాక్షాత్తు పరమేశ్వరుడి భార్య గౌరీదేవి అని అర్థం.

మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి.

ఈరోజు 2 నుంచి 10 సంవత్సరాలలోపు పిల్లలను సాక్షాత్తు అమ్మవారిగా భావించి వారికి బట్టలు పెట్టాలి.

పూజానంతరం మన మనసు మొత్తం అమ్మవారిపై ఉంచాలి.పురాణాల ప్రకారం నవరాత్రులు అధర్మంపై ధర్మం గెలవడం వల్ల ఎంతో సంతోషంగా జరుపుకుంటామని భావిస్తారు.

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి.అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి.

Navaratri 2021 Second Day Puja And Prasadam And Which Color Dress For Maa Durga, Navratri, Devi Navratri, Dasara Festival, Pooja - Telugu Navratri, Dasara Festival, Devi Navratri, Pooja

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube