దసరా 9 రోజులు ఈ నియమాలు పాటించండి అంతా శుభమే.

దసరా నవరాత్రులు ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి.ఈ తొమ్మిది రోజులు ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు.

 Navaraatrulu 9 Rojulu Ilaa Cheste Manchidi-TeluguStop.com

ఇలా పూజించటం వలన ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి.అయితే నవరాత్రి పూజ మొదలు పెట్టిన ఈ రోజు నుంచి దశమి వరకు కొన్ని నియమాలను పాటించాలి.

ఆలా నియమ నిష్టలతో పూజ చేస్తే ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి.మరి ఆ నియమాల గురించి తెలుసుకుందాం.

ఈ నవరాత్రి తొమ్మిది రోజులు పండ్లు,పాలు మాత్రమే తీసుకోని ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.

అమ్మవారి పూజను పూజగదిలో కానీ తూర్పు దిక్కున కానీ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

మామిడి తోరణం,పువ్వులతో ఆ ప్రాంతాన్ని అలంకరించాలి.

త్రిసూలం,సింహ వాహనంతో ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిది.

ప్రతి రోజు అష్టోత్తరాలు, లలితా పారాయణం, దేవి సహస్రాలు పారాయణ చేస్తే మంచిది.

ఈ తొమ్మిది రోజులు బంతి, కనకాంబరం, చామంతి, జాజి ఇలా అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని పూజించాలి.

ఈ తొమ్మిది రోజులు రోజుకొక నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి.

ఈ తొమ్మిది రోజులు నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించటం ముఖ్యం.

ఆయుధ పూజ రోజున ఆయుధాలను, వాహనాలను పూజించాలి.

ఇలా తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube