దసరా 9 రోజులు ఈ నియమాలు పాటించండి అంతా శుభమే.  

దసరా నవరాత్రులు ఈ రోజుతో ప్రారంభం అవుతున్నాయి.ఈ తొమ్మిది రోజులు ఎంతో నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తారు.ఇలా పూజించటం వలన ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి..

Navaraatrulu 9 Rojulu Ilaa Cheste Manchidi--

అయితే నవరాత్రి పూజ మొదలు పెట్టిన ఈ రోజు నుంచి దశమి వరకు కొన్ని నియమాలను పాటించాలి.ఆలా నియమ నిష్టలతో పూజ చేస్తే ఇంటిలో సుఖ సంతోషాలు ఉంటాయి.మరి ఆ నియమాల గురించి తెలుసుకుందాం.

ఈ నవరాత్రి తొమ్మిది రోజులు పండ్లు,పాలు మాత్రమే తీసుకోని ఒక పూట మాత్రమే భోజనం చేయాలి.అమ్మవారి పూజను పూజగదిలో కానీ తూర్పు దిక్కున కానీ ఏర్పాటు చేసుకుంటే మంచిది.మామిడి తోరణం,పువ్వులతో ఆ ప్రాంతాన్ని అలంకరించాలి.

త్రిసూలం,సింహ వాహనంతో ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠిస్తే మంచిది.ప్రతి రోజు అష్టోత్తరాలు, లలితా పారాయణం, దేవి సహస్రాలు పారాయణ చేస్తే మంచిది.ఈ తొమ్మిది రోజులు బంతి, కనకాంబరం, చామంతి, జాజి ఇలా అన్ని రకాల పువ్వులతో అమ్మవారిని పూజించాలి.

ఈ తొమ్మిది రోజులు రోజుకొక నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి.ఈ తొమ్మిది రోజులు నేల మీద పడుకోవడం, బ్రహ్మచర్యం పాటించటం ముఖ్యం.ఆయుధ పూజ రోజున ఆయుధాలను, వాహనాలను పూజించాలి.

ఇలా తొమ్మిది రోజులు నియమ నిష్టలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది.