నవగ్రహ దోషాలు ఉన్నవారు గణపతిని ఇలా పూజిస్తే ఆ దోషాలు అన్ని తొలగిపోతాయి

ప్రతి వ్యక్తి జీవితంలోను గ్రహాల కారణంగా శుభ ఫలితాలు,అశుభ ఫలితాలు రెండు ఉంటాయి.శుభ ఫలితాలు ఉన్నప్పుడు ఆనందంగానే ఉంటాం.

 Navagraha Doshalu With Lord Ganesha-TeluguStop.com

అయితే అశుభ ఫలితాలు కలిగినప్పుడు మాత్రం చాలా కాస్త బాధపడుతూ ఉంటాం.అలాంటి ఆశుభ ఫలితాలు కలిగినప్పుడు వాటిని తొలగించుకోవడానికి గణపతిని పూజించాలి.

ఏ గ్రహ దోషం ఉన్నవారు గణపతిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.గణపతిని ఇప్పుడు చెప్పే విధంగా పూజిస్తే దోషాలు అన్ని తొలగిపోతాయి.

సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో వినాయకుణ్ణి పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కేతు దోష నివారణకు తెల్ల జిల్లేడు పూలతో వినాయకుణ్ణి పూజించాలి.

చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాతితో తయారుచేసిన వినాయకుడిని పూజించాలి.

కుజదోష నివారణకు రాగితో తయారుచేసిన వినాయకుడిని పూజిస్తే మంచి ఫలితం త్వరగా కనపడుతుంది.

గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.

బుధ దోష నివారణకు మరకత వినాయకుణ్ణి పూజించాలి.

శుక్ర దోష నివారణకు స్ఫటిక వినాయకుడికి భక్తితో పూజించాలి.

రాహు గ్రహ దోషానికి మట్టితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజిస్తే ఫలితం ఉంటుంది.

ఇంటిలో సుఖ శాంతులు ఉండాలంటే స్పటిక వినాయకుణ్ణి పూజించాలి.

మానసికంగా ప్రశాంతత కలగాలంటే పాలరాతితో తయారుచేసిన వినాయకుణ్ణి పూజించాలి.

పైన చెప్పిన విధంగా ఎవరికీ ఏ గ్రహ దోషం ఉందో తెలుసుకొని నివారణకు భక్తితో వినాయకుణ్ణి పూజించాలి.ఈ విధంగా చేయటం వలన తొందరగానే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube