రామ్ చరణ్ ని సినిమా సపోర్ట్ చెయ్యమంటే.. ముఖం మీదే ఆ మాట అన్నారట!

Natyam Movie Heroine Sandhya Raju About Ram Charan Comments On Natyam Movie

సంప్రదాయ నాట్యం నేపథ్యంలో సినిమా అనగానే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చేవి- సాగరసంగమం, స్వర్ణకమలం, సిరిసిరిమువ్వ, శ్రుతిలయలు.మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత “నాట్యం” పేరుతో అటువంటి సినిమా ఒకటొస్తోందన్న ఆసక్తి ప్రేక్షకులకి కలిగింది.

 Natyam Movie Heroine Sandhya Raju About Ram Charan Comments On Natyam Movie-TeluguStop.com

ఇక వివరాల్లోకి వెళితే ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’.

రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Natyam Movie Heroine Sandhya Raju About Ram Charan Comments On Natyam Movie-రామ్ చరణ్ ని సినిమా సపోర్ట్ చెయ్యమంటే.. ముఖం మీదే ఆ మాట అన్నారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే రామ్ చరణ్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, కానీ మిగతా వాళ్ళందరికీ తమ కంటెంట్ చూపించి, కంటెంట్ నచ్చితే తమకు హెల్ప్ చేస్తారా అని అడిగినప్పుడు వారంతా వచ్చి తమకు చాలా ప్రోత్సాహం అందించారని ప్రముఖ నటి సంధ్యా రాజు తెలిపారు.

ఎందుకు అంటే ముఖ్యంగా వాళ్లకు కంటెంట్ నచ్చింది కాబట్టి అని ఆమె స్పష్టం చేశారు.అలాగే రామ్ చరణ్ గారు కూడా సినిమా చూసిన తర్వాతే తనకు ఎలా ఉందో చెప్పారని ఆమె అన్నారు.

తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఈ ఆసినిమా ఒకవేళ బాగోలేకపోతే బాలేదని ముఖంమీద చెప్పేస్తారు అని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Kuchipudi Dancer Sandhya Raju, Natyam, Natyam Movie Promotions, Pre Release Event, Ram Charan, Sandhya Raju, Tollywood, Upasana-Movie

ఆ విషయం చరణ్ ముందే తనకు చెప్పారని, అంటే ఒకవేళ తనకు కంటెంట్ నచ్చితేనే తనకు హెల్ప్ చేయాలా వద్దా, ఏం చేయాలి అనేది అతను డిసైడ్ చేస్తా అని తనకు చెప్పినట్టు సంధ్యా రాజు వివరించారు.ఇక ఆయన ఈ సినిమా చూసి బయటకు రాగానే తాను చాలా టెన్షన్ పడ్డాను అని ఆమె అన్నారు.ఆయన దగ్గరికి వచ్చి బాగుంది.

సినిమా చాలా చాలా బాగుంది.నాకు నచ్చింది.

నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను.సినిమాలో తనకు ఇది నచ్చింది, అది నచ్చింది, అని పర్టిక్యులర్గా చెబుతూ ఉంటే తను చూస్తూ నమ్మలేకపోయాని సంధ్యా రాజు ఆనందం వ్యక్తం చేశారు.

Telugu Kuchipudi Dancer Sandhya Raju, Natyam, Natyam Movie Promotions, Pre Release Event, Ram Charan, Sandhya Raju, Tollywood, Upasana-Movie

ఇకపోతే ఈ సినిమాను ఉపాసన గారికి కూడా చూపించాలని సంధ్యా రాజు తెలిపారు.ఆ సినిమాను మొట్టమొదటిగా ఆమె చేతుల మీదుగానే స్టార్ట్ చేశానన్న ఆమె, అది అక్కడి నుంచి అలా వెళ్లి తిరిగి చివరికి మళ్లీ చరణ్ గారి చేతుల మీదుగానే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేపించామని అన్నారు.వారిద్దరి చేతుల మీదుగా తన కెరీర్ మొదలయింది అంటూ ఆమె సంతోషంగా చెప్పారు.

ఈ మధ్యే విడుదలైన ఈ చిత్రంపై మంచి టాక్ వినిపిస్తోంది.

నిజంగా సంధ్యారాజు గారి నాట్యప్రతిభ చూపించుకోవడం కోసం తీసిన సినిమా ఇది.ఆమె నాట్యం నిజంగా బాగున్నట్టు చూస్తేనే తెలుస్తుంది.అందులో వంకలు పెట్టేంత సాగరసంగమం కమలహాసన్ స్థాయి సమీక్ష కాదిది.ఆమె నాట్యం కనులవిందుగానే ఉందని ప్రముఖులు సైతం అంటున్నారు.

#Pre #Upasana #Natyam #Ram Charan #Natyam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube