అగ్ర రాజ్యంపై ప్రకృతి ప్రకోపం...తాజాగా...

అగ్ర రాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతోంది బిడెన్ ప్రభుత్వం.

 Nature's Wrath On The Top Kingdom Fresh , American, Biden Government, Forest L-TeluguStop.com

మొదటి వేవ్ కంటే కూడా థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఒక వైపు కరోనా మహమ్మారుల వరుస దాడులతో అల్లాడిపోతున్న అమెరికన్స్ పై ప్రకృతి సైతం తన కోపాన్ని చూపిస్తోంది.

కొద్ది రోజుల క్రితం అమెరికాలోని పలు ప్రాంతాలలో అటవీ భూములు అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో వేల ఎకరాల అటవీ ప్రాంతం దహించుకుని పోయింది.

కాలిఫోర్నియా ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రభావం చూపింది.అయితే ఇదే సమయంలో కాలిఫోర్నియాలో విపరీతంగా కరోనా కేసులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ కారుచిచ్చేనని నిపుణులు తేల్చి చెప్పారు.

ప్రభుత్వ చర్యల కారణంగా మంటలు ఆరిపోయాయని భావించిన సమయంలో మళ్ళీ ప్రజలు ఉలిక్కిపడేలా మంటలు వ్యాపించాయి.ఈ ప్రభావంతో పలు ఇళ్ళు అగ్నికి ఆహుతి అయ్యాయి.అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ దాదాపు 1.8 లక్షల ఎకరాలు కాలి బూడిద అయ్యాయని అంచనావేస్తున్నారు.ఇప్పటి వరకూ అన్ని ప్రాతాలలో కలిపి సుమారు 14 లక్షల ఎకరాలు మంటలో కాలిపోయాయని అధికారికంగా ప్రకటించారు.

Telugu American, Biden, Calinia, Forest, Interstate, Karosh-Telugu NRI

ఇదిలాఉంటే మరో విపత్తు అమెరికాలో ఊటా నగరాన్ని కమ్మేసింది.ఇసుక తుఫాను ఊట లోని కరోష్ కు దగ్గరలోని ఇంటర్స్టేట్ ప్రాంతంలో ఒక్కసారిగా ఇసుక తుఫాను విరుచుకుపడింది.ఏం జరుగుతోందో తెలుసుకునే లోగానే ఒక్కసారిగా అందరిని చుట్టుముట్టేసింది.ఈ తుఫాను కారణంగా 20 వాహనాలు ఒకదానికి ఒకటి వేగంగా వచ్చి డీ కొట్టుకున్నాయని దాంతో 7గురు అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తోంది.

గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రులకు తరలించినట్టుగా అధికారులు తెలిపారు.ఒక పక్క కరోనాతో అల్లాడిపోతున్న అమెరికన్స్ ప్రకృతి వైపరిత్యాలతో భాయందోళనలకు లోనవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube