పచ్చదనం,పెంపుడు జంతువులతో ఒత్తిడి దూరం  

మనిషి ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవనానికి అనేక రకాలైన ఒత్తిడులకి గురవుతున్నాడు. ఉద్యోగ రీత్యా ఉండే సమస్యలకి ఇంటికి రాగానే భార్యమీద కోప్పడటం,లేదా నీరసించి పోవడం ,అనేక రోగాల బారిన పడి ఒక యంత్రంలా బ్రతుకుతున్నాడు.ఈ ఒత్తిడిని దూరం చేసుకోడానికి డబ్బు వృధా పనులు చేస్తూ ఇటు ఆర్ధికంగా ,అటు మానసికంగా నష్టపోతున్నాడు...

-

ప్రకృతికి మించిన స్నేహితుడు లేడు. ఒక్కసారి పచ్చదనం ఉన్న కొండలు కానీ ,అడువులు కానీ మనం చూసినప్పుడు మనకి మనసులో కలిగే ఒక అనుభూతి అందరికీ తెలిసిందే.ఈ విషయాన్నే యూనివర్సిటీ ఆఫ్‌ రిచర్డ్‌ వైద్యులు.

వందల మందిపై జరిపిన పరిశోధన తర్వాత వారు కొన్ని ఆసక్తికరమైన వాస్తవాన్ని వెల్లడించారు. వాటిని మీరు చుడండి.ప్రతీ మనిషి తమ దినచర్యలో భాగంగా ఎక్కువ సమయం మొక్కల పెంపకం,పచ్చదనం ఉన్న ప్రదేశం లో నడవడం చేస్తే లాన్‌లో మనసు తేలిక పడుతుంది.

ఆ సమయంలో మనిషికి కొత్త ఆలోచనలు కలుగుతాయట. అందుకే నిపుణులు యోగా, ధ్యానానికి అనువుగా పచ్చని ప్రదేశాలకు ప్రాధాన్యమిస్తారు. అలానే తోటపని చేయడానికి, మొక్కల పెంపకానికి వీలు కాకపోతే కనీసం పచ్చని చెట్లు ఉన్న చిత్రాలనయినా ఇంటి గదుల్లో అలంకరించుకుంటే కొంత ఉపశమనం కలుగుతుందటఅంతేకాదు ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నా కూడా మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చట.

హుద్రోగా సమస్యలని అధిగమించవచ్చని తెలిపారు. మనం అనేకరకాలైన పనులు చూసుకుని ఇంటికి వచ్చినపుడు అవి మనకి ఎదురయ్యి మన మీద వాటి ప్రేమని చూపించే తీరు, అవి మనతో ఆడుకోవడానికి కొట్టే కేరింతల తో మానసిక ఉల్లాసం మనకి కలిగి ఎంత పెద్ద కష్టం అయినా చాలా చిన్నగానే కనిపిస్తుందట. అంతేకాదు వాటి ఆరోగ్య విషయంలో మనం తీసుకునే జాగ్రతలు మనలో చాలా సున్నిత మనసుని కలిగేలా చేస్తాయట.

చాలా మంది కుటుంభ సభ్యులుగా జంతువులని చూసుకుంటారు. ఇంట్లో వాటికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తుంటారు. అవి మనుషులతో పూర్తిగా కలిసిపోతూ, మన మనస్సులో నూతన ఉత్తేజాన్ని నింపుతాయి.