నేటి కాలంలో చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొంటున్నారు.ఉరుకుల పరుగల జీవితంలో పని ఒత్తిడి, మానసిక ఆందోళన, వాయిస్ పొల్యూషన్, ఆహారపు అలవాట్లు, సరైన సమయానికి తినకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల తలనొప్పి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే తలనొప్పి రాగానే చాలా మంది టక్కున పెయిన్ కిలర్స్ వేసేసుకుంటారు.కానీ, పెయిన్ కిలర్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.
మరి తలనొప్పి ఎలా తగ్గించుకోవాలి అంటే.న్యాచురల్ పద్ధతిల్లో తగ్గించుకోవాలి.

అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.తలనొప్పి క్షణాల్లో తగ్గాలంటే.ఒక గ్లాస్ నీటిలో జీలకర్ర, అల్లం ముక్కలు మరియు కొత్తమీర వేసి బాగా మరిగించి.కాస్త గోరు వెచ్చగా అయిన తర్వాత వాడగట్టుకుని సేవించాలి.ఇలా చేస్తే క్షణాల్లోనూ తలనొప్పి పరార్ అవుతుంది.లేదంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు రాతి ఉప్పు కలిసి తీసుకోవాలి.
ఇలా తీసుకున్నా తలనొప్పి సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందచ్చు.
ఇక తలనొప్పిని నివారించడంలో నిమ్మ రసం అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, తలనొప్పితో బాధ పడుతున్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మ రసం కలిసి తీసుకుంటే.మంచి ఉపశమనం లభిస్తుంది.సాధారణంగా ఎక్కువ సమయం పాటు కంప్యూటర్, ల్యాప్ టాప్ స్క్రీన్స్ ను చూస్తుండటం వల్ల చాలా మంది తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు.అలాంటి వారు గంటకు ఒకసారి కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్ ముందు నుంచి లేచి ఐదు నిమిషాలు అయినా రెస్ట్ తీసుకోవాలి.

అలాగే శరీరంలో కొన్నిసార్లు నీరు శాతం తక్కువైనా తలనొప్పి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.అందువల్ల, ప్రతి రోజు శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలి.ఇక తలనొప్పితో బాధ పడుతుంటే.యాపిల్, ఆరెంట్, దానిమ్మ, ద్రాక్ష వంటి ఫ్రూట్స్‌ను తీసుకుంటే త్వరగా రికవర్ అయిపోతారు.
.