మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి  

Natural Ways To Beat Stomach Pain During Periods-during Periods,eating More Fruits,hot Water Bath,stomach Pain

మహిళలు ప్రతి ఒక్కరు కూడా నెలలో ఆ మూడు రోజులు చాలా ఇబ్బంది పడతారు. మనసికంగా, శారీరకంగా వారు ఆ మూడు రోజులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొందరు మహిళలు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు...

మహిళలు నెలసరి సమయంలో పొత్తి కడుపు నొప్పి లేకుండా ఉండాలంటే ఇలా చేయాలి-Natural Ways To Beat Stomach Pain During Periods

అత్యంత దారుణమైన పరిస్థితులను కొందరు మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. పొత్తి కడుపు నొప్పి తగ్గించుకునేందుకు మహిళలకు వైధ్య నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అందులో ముఖ్యమైనది వ్యాయామం.

మహిళలు నెలసరి సమయంలో విపరీతమైన నొప్పి అనుభవిస్తున్నారు అంటే వారు సాదారణ సమయంలో వ్యాయామం కాని వేరే ఇతర ఏ పని కాని చేసి కష్టపడటం లేదని అర్థం. పనులు చేసే వారు వ్యాయామం చేసినట్లుగా అవుతుంది కనుక వారికి నెలసరి సమయంలో ఇతరులతో పోల్చితే చాలా వరకు తక్కువ పొత్తి కడుపు నొప్పి ఉంటుందని వైధ్యులు అంటున్నారు. ఇంట్లో ఉండే వారు కూడా రోజు కూడా సాదారణ వ్యాయామం చేసినట్లయితే నెలసరి సమయంలో ఎక్కువగా నొప్పి రాదని వైధ్యులు సూచిస్తున్నారు.

వ్యాయామం వల్ల కండరాలు సంకోచం చెందడంతో పాటు, నెలసరి సమయంలో వాటిపై ఎక్కువ ప్రభావం ఉండదు.

నెలసరి సమయంలో ఆడవారు ఎక్కువగా బ్లడ్‌ లాస్‌ అవుతూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా బలమైన ఆహారం తీసుకోవాలి. అలా ఆహారం తీసుకుంటేనే తప్పకుండా మంచి బలంగా ఉంటారు.

బ్లడ్‌ లాస్‌ సమయంలో ఆహారం తీసుకోకుంటే మరింతగా పొత్తి కడుపు నొప్పి లేస్తుంది. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని వైధ్యులు చెబుతున్నారు...

ఇక నెలసరి సమయంలో ఆడవారు ఎక్కువగా వేడి నీటితో స్నానం చేయడం మంచిది. వేడినీటి స్నానం వల్ల కండరాలపై ఒత్తిడి తగ్గడంతో పాటు రిలీఫ్‌ను ఇస్తుంది.

కడుపు నొప్పి మరియు కాళ్లు చేతులు గుంజడం వంటివి జరిగితే అప్పుడు వేడి నీటి స్నానం చాలా మంచిదని వైధ్యులు అంటున్నారు...

ఇక ప్రతి మహిళ నెలసరి సమయంలో వారి భర్తలు చాలా జాగ్రత్తగా చూసుకోవడం, వారికి చిరాకు కలగకుండా, ప్రతి రోజు కంటే వారిని విభిన్నంగా చూడటం వల్ల వారిలో సగంకు పైగా నొప్పి తగ్గుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.