మెగాస్టార్ సూపర్ హిట్ మూవీ టైటిల్ వాడేస్తున్న నాని!

న్యాచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కనున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఇప్పటికే జరిగింది.

 Natural Star Nani Used Megastar Super Hit Movie Title-TeluguStop.com

ఇక విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ కి టాలీవుడ్ లో గుర్తింపు ఉంది.అలాంటి దర్శకుడు నానితో సినిమా చేస్తున్నాడు అనే విషయం టాలీవుడ్ లో ఆసక్తికరం గా మారితే, నాని కెరీర్లో చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఓ విభిన్న కథాంశంతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర నిర్మాతలు అధికారికంగా రిలీజ్ చేశారు.మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీ అయిన గ్యాంగ్లీడర్ టైటిల్ను నాని తన కొత్త సినిమా కోసం వాడు కావడం విశేషం.

అయితే ఈ సినిమా కథాంశం కాస్త డిఫరెంట్ గా నడుస్తుంది అని చిత్ర నిర్మాతలు రిలీజ్ చేసిన వీడియో బట్టి తెలుస్తుంది.ఐదుగురు లేడీస్ తో దొంగతనాలు చేస్తూ చట్టానికి దొరకకుండా తప్పించుకొనే గ్యాంగ్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరి నానికి కెరియర్లో విభిన్న కథాంశంతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube