బోర్డర్ దాటేస్తున్న నాని.. అన్ని భాషల్లోనా..?

ప్రస్తుతం టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల్లో నాని నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నారు. ఎంసీఏ సినిమా తరువాత నాని నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా నాని మార్కెట్ మాత్రం తగ్గలేదు.

 Natural Star Nani Shyam Singai To Be Pan India Movie,sam Singamrai,tollywood,nan-TeluguStop.com

ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు మరికొన్ని కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

అయితే నాని శ్యామ్ సింగరాయ్ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుందని సమాచారం.

టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర భాషల్లో సినిమాలను విడుదల చేస్తున్నా ఒకరిద్దరు హీరోలు మాత్రమే ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.

హీరో రామ్ తను నటిస్తున్న రెడ్ సినిమాను ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు.నాని కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ప్రభాస్ కు పాన్ ఇండియా ఇమేజ్ రాగా అల్లు అర్జున్ కు కేరళలో మంచి గుర్తింపు ఉంది.

Telugu Natural Nani, Pan India, Shyam Singarai, Tuck Jagadish-Movie

మహేష్ బాబు సినిమాలు తమిళంలో విడుదలై అక్కడ మంచి ఫలితాన్ని అందుకుంటున్నాయి.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతమవుతుందని భావిస్తున్నారు.పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేద్దామని ఈ సినిమా మేకర్స్ భావిస్తున్నారు.

అయితే శ్యామ్ సింగరాయ్ సినిమాను ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.ఈ సినిమాలో నాని రెండు పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం.

ఇప్పటివరకు తెలుగుకే పరిమితమైన నాని ఇతర భాషల్లో కూడా తన సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంత ఆసక్తి చూపుతుండటంతో నాని బోర్డర్ దాటేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube