దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాతగా తెరకెక్కనున్న చిత్రం గాలి సంపత్ ఈయన ఈ సినిమాలో నిర్మాతగానే కాకుండా స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో కూడా చేస్తున్నాడు.అంతేకాకుండా ఈ సినిమాలో అనిల్ కో-డైరెక్టర్ మిత్రుడు ఎస్ కృష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
అనీష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్నాడు.
లవ్లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక నటకిరీటిడా.
రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో గాలి సంపత్ గా టైటిల్ రోల్ చేస్తున్నాడు.ఇందులో రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు తండ్రి కొడుకులు గా నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో తొలి పాట ను మంగళవారం సాయంత్రం హీరో నాని విడుదల చేయగా కొన్ని విషయాలను నాని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.ఫీఫీఫీ ఫీఫీఫీ అంటూ ఈ పాట చాలా బాగుందని, వినడానికి ఎంత బాగుంటుందో చూడటానికి కూడా అంతే అందంగా ఉందని, అందుకే ఈ పాటను విడుదల చేసినందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని నాని తెలిపాడు.

ఈ సినిమాలో నటిస్తున్న రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు లు తనకు గిఫ్టెడ్ యాక్టర్స్ అంటూ వాళ్లను అభిమానించాడు.ఇక ఇందులో తనికెళ్ల భరణి, సత్య, రఘు బాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మీమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూప లక్ష్మి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఇక ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.