స్టార్ హీరో అక్క పాత్రలో ఇలియానా

ఇలియానా అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్.ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చూపించే వారు.

 Ileana Play Star Hero Sister Role In Telugu, Natural Star Nani, Rahul Sankrityay-TeluguStop.com

అలాగే నిర్మాతలు, దర్శకులు కూడా స్టార్ హీరోల సినిమాలలో ఫస్ట్ ఛాయస్ గా ఇలియానాని తీసుకునేవారు.అయితే స్టార్ ఇమేజ్ అలా ఉండగానే ఇలియానా జెండా మార్చేసినట్లు బాలీవుడ్ కి చెక్కేసింది.

టాలీవుడ్ లో వచ్చిన స్టార్ హీరోయిన్ ఇమేజ్ తో బాలీవుడ్ లో తన రేంజ్ మారిపోతుందని, అక్కడ గ్రాండ్ వెల్ కమ్ చెబుతారని భావించింది.అయితే మొదటి సినిమా బార్ఫీ తర్వాత రెండో సినిమా ఆఫర్ రావడానికి ఆమెకి చాలా సమయం పట్టించి.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోదామని అనుకుంటే అక్కడ అడపాదడపా అవకాశాలు తప్ప తనని గుర్తించే వారే లేకుండా పోయారు.దీంతో వచ్చిన అవకాశాలతోనే నెట్టుకొస్తోంది.

సౌత్ లో ఆ మధ్య రవితేజ అమర్ అక్బర్ అంటోనీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.ఇక టాలీవుడ్ లో కూడా హీరోయిన్స్ మధ్య కాంపిటేషన్ ఎక్కువ కావడం, ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం కావడంతో ఇలియానా మీద మన దర్శకులకి ఆసక్తి తగ్గిపోయింది.

అయితే తనకున్న పరిచయాలతో ఇలియానా సౌత్ లో అవకాశాల కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో నాగార్జున, ప్రవీణ్ సత్తారు సినిమాలో ఇలియానాకి అవకాశం ఇచ్చారని టాక్.

అలాగే నాని రాహుల్ సాంకృత్యాన్ తో చేస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఇలియానాని సంప్రదించినట్లు తెలుస్తుంది.అయితే అది నానికి అక్క పాత్ర అని సమాచారం.

అక్క పాత్ర అయినా సినిమాలో ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ నేపధ్యంలోనే ఒక స్టార్ హీరోయిన్ అయితే బెటర్ అని ఇలియానాని సంప్రదించినట్లు సమాచారం.మరి ఆ పాత్రకి ఇలియానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube