సమంత కోసం నాని ప్రయత్నాలు ఫలిస్తాయా..?

హీరోగానే కాదు నిర్మాతగా కూడా నాని తన ఫాం కొనసాగిస్తున్నారు.నాని నిర్మాతగా అ!, హిట్ సినిమాలు నిర్మించారు.ఆ రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.ఇక ఈ సినిమా తర్వాత లేటెస్ట్ గా తన ప్రొడక్షన్ లో మీట్ క్యూట్ సినిమా నిర్మిస్తున్నారు నాని.

 Natural Star Nani Production Samantha Movie, Latest News, Movie, Nani, Natural S-TeluguStop.com

తన సోదరిని డైరక్టర్ గా పరిచయం చేస్తూ నాని ఈ సినిమా చేస్తున్నారు.ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ నటిస్తున్నారని తెలుస్తుంది.లీడింగ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ అంతా మీట్ క్యూట్ లో నటిస్తారని టాక్.

ఇక ఇదిలాఉంటే నాని తన నెక్స్ట్ సినిమాను సమంతతో చేస్తాడని టాక్.

తన ప్రొడక్షన్ లో వచ్చే నెక్స్ట్ సినిమా సమంతని తీసుకోవాలని చూస్తున్నారట.ఈ సినిమాలో నాని కూడా నటిస్తాడని తెలుస్తుంది.

ఆఫ్టర్ మ్యారేజ్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకే ప్రాముఖ్యత ఇస్తున్న సమంత నాని నిర్మాణంలో సినిమాకు ఓకే చెబుతుందా లేదా అన్నది చూడాలి.నాని సమంతని ఎలాగైనా మెప్పించాలని చూస్తున్నాడు.

సమంత ఒప్పుకుంటే దాదాపు తన సినిమా హిట్ అయినట్టే అందుకే సమంత కోసం నాని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్.  ఇక నాని హీరోగా నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉండగా శ్యాం సింగ రాయ్ సెట్స్ మీద ఉంది.

ఈ సినిమాతో పాటుగా అంటే సుందరానికీ సినిమా కూడా చేస్తున్నాడు నాని.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube