'కృష్ణగాడి వీర ప్రేమగాథ' కాంబో రిపీట్.. నాని గ్రీన్ సిగ్నల్!

న్యాచురల్ స్టార్ నాని ప్రెసెంట్ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈ మధ్యనే శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.

 Natural Star Nani Next Movie With Hanu Raghavapudi, Hanu Raghavapudi,dasara, Dir-TeluguStop.com

శ్యామ్ సింగరాయ్ నాని కెరీర్ లో మరొక మైలు రాయిలాగా నిలిచి పోయింది.ఈ సినిమా తర్వాత నాని అంటే సుందరానికి సినిమా చేసాడు.

ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ మాత్రం రాబట్టలేక పోయింది.

ఇక నాని ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు.కానీ ఇప్పుడు మాత్రం ఊర మాస్ లుక్ లోకి వచ్చి మాస్ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

ప్రెసెంట్ నాని శ్రీకాంత్ ఓడేలా దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు.

గోదావరి ఖని లోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.ఇందులో ఈయనకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా చేతిలో ఉండగానే మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.

Telugu Dasara, Srikanth Odela, Keerthy Suresh, Nani-Movie

ఆ డైరెక్టర్ మరెవరో కాదు.సీతా రామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హను రాఘవపూడి.ఈయన అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.

నానితో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాను నానితో తీసి మరో హిట్ అందుకున్నాడు.అయితే ఆ తర్వాత మధ్యలో ప్లాప్స్ వచ్చిన ఇప్పుడు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.

Telugu Dasara, Srikanth Odela, Keerthy Suresh, Nani-Movie

ఈ సినిమా హిట్ తో ఈ డైరెక్టర్ పేరు మారుమోగి పోయింది.అందుకే ఈయనతో సినిమా చేయాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన నానితో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ టాక్ బయటకు వచ్చింది.మరి ఈ రూమర్ నిజమే అయితే కృష్ణగాడి వీర ప్రేమగాథ కాంబో మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

చూడాలి ఈసారి ఎలాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో హను రాఘవపూడి ప్రేక్షకుల ముందుకు వస్తాడో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube