సినిమా సినిమాకి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించాలనే తపన ఉండే హీరో న్యాచురల్ స్టార్ నాని.( Nani ) ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన ఆయన నేడు ఏ స్థానం లో ఉన్నాడో అందరికి తెల్సిందే.‘అష్టాచమ్మా’ నుండి ‘దసరా’ చిత్రం ( Dasara Movie ) వరకు నాని సినీ జర్నీ ప్రతీ యంగ్ స్టర్ కి ఒక ఆదర్శం అని చెప్పొచ్చు.ఈ ప్రయాణం లో ఆయనకీ హిట్స్ తో పాటుగా ఎన్నో డిజాస్టర్ ఫ్లాప్స్ కూడా ఎదురయ్యాయి.
కానీ ఏమాత్రం ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా, సరైన సబ్జక్ట్స్ తో మన ముందుకి వచ్చి బౌన్స్ బ్యాక్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి.నాని కి కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడాలి, స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాలి అని ఆయన ఫ్యాన్స్ తో పాటుగా ఆడియన్స్ కూడా కోరుకుంటూ ఉంటారు.
అలాంటి సమయం లో వచ్చిన ‘దసరా’ చిత్రం ఆయనకీ మంచి బూస్ట్ ని ఇచ్చిందనే చెప్పాలి.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం సుమారుగా 65 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.ఈ చిత్రం తర్వాత నాని ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు అని అందరూ ఎదురు చూస్తుండగా, ఆయన ప్రముఖ పాన్ ఇండియన్ డైరెక్టర్ జీతూ జోసఫ్ తో( Director Jeethu Joseph ) ఒక సినిమా ఓకే చేసినట్టు తెలుస్తుంది.జీతూ జోసఫ్ పాన్ ఇండియా వైడ్ గా దృశ్యం సిరీస్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు.

మలయాళం లో మోహన్ లాల్, తెలుగులో విక్టరీ వెంకటేష్, తమిళం లో కమల్ హాసన్ మరియు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఈ సిరీస్ లో నటించారు.అలాంటి సినిమా తీసిన డైరెక్టర్ తో నాని లేటెస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయ్యినందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.జీతూ జోసఫ్ సినిమాలు సస్పెన్స్ డ్రామా గా ఉంటాయి , లాజిక్స్ అసలు ఏమాత్రం మిస్ అవ్వకుండా తీస్తాడు.ఆయన సినిమా చూసే ఆడియన్స్ కి థియేటర్స్ లో మైండ్ బ్లాక్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇప్పుడు నాని తో కూడా అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేయబోతున్నాడని టాక్.ప్రస్తుతం నాని శౌర్య అనే నూతన దర్శకుడితో ఒక సినిమా చేస్తున్నాడు.ఇందులో సీతారామం చిత్రం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఒక ఫీల్ గుడ్ మూవీ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాతో నాని మరో బ్లాక్ బస్టర్ అందుకుంటాడా?, దసరా తో 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఆయన, అదే రేంజ్ ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.ఇక జీతూ జోసఫ్ తో చెయ్యబోయే సినిమా కూడా ఈ ఏడాదిలోనే ప్రారంభం అవ్వబోతుందని టాక్.
ఇందులో హీరోయిన్ ఎవరు, మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ వివరాలు తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.
