ఐదుగురు ఆడవాళ్ళ గ్యాంగ్ కి లీడర్ గా నాని  

Natural Star Nani New Movie Gang Leader First Look-

జెర్సీ లాంటి సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకొని జోరు మీద ఉన్న నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ సినిమాలు రెండు కాస్తా భిన్నమైన కథలతో ప్లాన్ చేసుకున్నాడు.అందులో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ కాగా, మరొకటి ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉన్నాయి.ఈ రెండు సినిమాలని సెట్స్ పైకి తీసుకెళ్ళిన నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు...

Natural Star Nani New Movie Gang Leader First Look--Natural Star Nani New Movie Gang Leader First Look-

ఇదిలా ఉంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న నాని గ్యాంగ్ లీడ‌ర్ ఫ‌స్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయ్యింది.మెగాస్టార్ చిరంజీవి టైటిల్ ని వాడుకొని డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న నాని ఇందులో కొంత మంది లేడీస్ కి లీడర్ గా ఉంటూ దొంగతనాలు చేయిస్తూ ఉంటాడని తెలుస్తుంది.ఈ నేపధ్యంలోనే తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

నాని ఐదుగురు ఆడ‌వాళ్ల‌తో క‌లిసి క‌నిపిస్తున్నాడు.8 ఏళ్ల చిన్న‌ పాప‌.17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి.22 ఏళ్ల క‌త్తి లాంటి అమ్మాయి.50 ఏళ్ల అమ్మ వ‌య‌సు ఉన్న మ‌హిళ.కాటికి కాలు చాపుకున్న బామ్మ‌.

Natural Star Nani New Movie Gang Leader First Look--Natural Star Nani New Movie Gang Leader First Look-

ఈ ఐదుగురు గ్యాంగ్ తో చట్టానికి సవాల్ విసిరే ఓ వ్యక్తి పాత్రలో నాని కనిపించబోతున్నాడు.విక్రమ్ కె కుమార్ మార్క్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కే ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి.