పాపం గ్యాంగ్‌ లీడర్‌ది విచిత్రమైన పరిస్థితి

నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ను దక్కించుకుంది.సినిమాకు వచ్చిన పాజిటివ్‌ టాక్‌తో తప్పకుండా మంచి వసూళ్లను నమోదు చేస్తుందని అంతా ఆశించారు.

 Natural Star Nani Gang Leader Latestupdate-TeluguStop.com

కాని గ్యాంగ్‌ లీడర్‌ వచ్చిన పాజిటివ్‌ టాక్‌ను కలెక్షన్స్‌ రూపంలోకి కన్వెర్ట్‌ చేసుకోవడంలో విఫలం అయ్యాడు.సినిమా బాగుంది కాని, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేవు అంటూ టాక్‌ వచ్చింది.

దాంతో కమర్షియల్‌ సినిమాలు అంటే చెవులు కోసుకునే తెలుగు ప్రేక్షకులు గ్యాంగ్‌ లీడర్‌ను పట్టించుకోలేదు.

Telugu Nani, Naturalnani, Vikram Kumar-

  నాని ఈ చిత్రంలో మంచి నటనతో పాటు తనదైన శైలి కామెడీ టైమింగ్‌తో మెప్పించాడు.కాని ప్రేక్షకులు మాత్రం హీరోయిన్‌తో రొమాన్స్‌ లేదు, రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో ఉండే కామెడీ లేదు అంటూనే బాగుందని టాక్‌ స్ప్రెడ్‌ చేశారు.దాంతో మరి కొన్ని రోజులు ఆగితే సినిమాను టీవీలో చూడవచ్చులే అనుకుని థియేటర్‌కు వెళ్లకుండా ఉండిపోయారు.

సినిమాకు పబ్లిసిటీ బాగానే చేసినా కూడా సినిమా మాత్రం జనాల్లో ఎక్కువగా ఆధరణ దక్కించుకోలేక పోయింది.

Telugu Nani, Naturalnani, Vikram Kumar-

  నాని గత చిత్రం ‘జెర్సీ’ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.ఆ చిత్రం యాంటీ క్లైమాక్స్‌ ఉన్న కారణంగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకోలేదు.జెర్సీ కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఫీల్‌ గుడ్‌ మూవీ అన్నారు.

కాని యాంటీ క్లైమాక్స్‌ కారణంగా సినిమాను నాశనం చేశారు అంటూ కామెంట్స్‌ వచ్చాయి.మొత్తానికి నానికి సక్సెస్‌ అందినట్లే అంది అందట్లేదు.మరి వీటిని సక్సెస్‌ అనుకోవాలా లేదా ఫ్లాప్స్‌ అనుకోవాలా ఆయన అభిమానులే నిర్ణయించుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube