సాధారణంగా కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉన్నా.చేతులు, కాళ్ళు మాత్రం నల్లగా ఉంటాయి.
ఎండల ప్రభావం, స్కిన్ కేర్ లేక పోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవడం, కఠినమైన సబ్బుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల కాళ్ళు, చేతులు డార్క్‌గా మారి పోతాయి.దాంతో ఆ నలుపుకు వదిలించుకునేందుకు రకరకాల ప్రయోగాలు, ప్రయత్నాలు చేస్తుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ హోమ్ మేడ్ క్రీమ్‌ను వాడితే గనుక చాలా సులభంగా కాళ్ళు, చేతుల నలుపును నివారించి తెల్లగా మెరిపించుకోవచ్చు.
మరి ఆ న్యాచురల్ క్రీమ్ ఏంటీ.? ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా చిన్న వైట్ బేబీ సూప్‌ను తీసుకుని తురిమి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బంగాళా దుంప తీసుకుని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకోవాలి.
అలాగే రెండు నిమ్మ కాయలను కూడా ముక్కలుగా కోసి గిన్నెలో వేసి ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
ఆ తర్వాత ఈ ముక్కలను పది నుంచి పది హేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఆపై బాగా చల్ల బెట్టుకుని మిక్సీలో పేస్ట్‌గా చేసుకోవాలి.ఈ మిశ్రమంలోనే ముందుగా తురిమి పెట్టుకున్న సూప్‌ను కూడా వేసి మెత్తగా గ్రౌండ్ చేసుకుంటే క్రీమ్ సిద్ధమైనట్టే.
ఈ క్రీమ్‌ను ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే దాదాపు పది లేదా పదిహేను రోజుల పాటు ఉంటుంది.
ఇక ఈ న్యాచురల్ క్రీమ్‌ను ఎలా వాడాలో కూడా చూసేయండి.
ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్లు తయారు చేసుకున్న క్రీమ్, ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే నల్లగా ఉన్న కాళ్ళు చేతులు తెల్లగా మారి మిలమిలా మెరిసిపోతాయి.