ముఖ చర్మం కాంతివంతంగా మారటానికి మూలికలతో ఆవిరి ఎలా పెట్టాలో తెలుసా?     2018-06-26   00:41:21  IST  Lakshmi P

మనం రోజు చర్మాన్ని శుభ్రం చేసుకోవటానికి ఎన్నో రకాలైన పద్దతులను ఉపయోగిస్తాం. అయితే కొన్ని సార్లు మంచి ఫలితం రాకపోవచ్చు. ముఖానికి శుభ్రపర్చటం, టోనింగ్, మాయిశ్చరైజర్, వారానికి ఒకసారి ప్యాక్ వేయటం వంటివి అన్ని చేస్తూ ఉంటాం. కానీ ముఖానికి అతి ముఖ్యమైన ఆవిరి పట్టటం అనేది చేయటం మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆవిరి ఎలా పెట్టాలో చూద్దాం.

ముందు ముఖాన్ని తేలికపాటి పేస్ వాష్ తో శుభ్రం చేయాలి. ఈ విధముగ చేయకపోతే మేకప్ కి సంబంధించిన అవశేషాలు చర్మ గ్రంధుల లోపలికి వెళతాయి. అందువల్ల ఆవిరి పెట్టటానికి ముందు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

కొంచెం రేణువులున్న స్క్రబ్ ని ఉపయోగించి ముక్కు,నుదురు ప్రాంతాలలో ఎక్కువగా దృష్టి పెట్టటం మంచిది. స్క్రబ్బింగ్ అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేయాలి.