పోడవైన జుట్టు కోసం సులువైన మార్గాలు

పొడవైన జుట్టు కావాలని ఏ ఆడపిల్లకి ఉండదు.పొడవైన జుట్టున్న అమ్మాయి దొరకాలని ఏ అబ్బాయికి ఉండదు.

 Natural Care For Long Hair-TeluguStop.com

బలంగా, పొడవుగా ఉండే జుట్టు ఆడవారి అందాన్ని మరింతగా పెంచుతుంది.ఎన్నో కవితలకు మూలాధారం పొడవైన జుట్టు.

మరి అలాంటి పొడవైన జుట్టు మీ సొంతం కావాలంటే చాలా సులువైన మార్గాలు ఉన్నాయి.తెలుసుకోని, ప్రయత్నించండి.

* కొబ్బరినూనే, తేనే కలిపి జుట్టుకి బాగా పట్టండి.అలాగే ఓ అరగంటపాటు వదిలేసి, మైల్డ్ షాంపూ వాడుతూ స్నానం చేయండి.

* సగం కప్పులో ఓట్స్ తీసుకోని మూడు టీ స్పూన్ల ఆల్మండ్ అయిల్ కలపండి.ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టి ఓ గంటపాటు ఉంచుకోని కడిగేయ్యండి.

* వెన్నపండుని జ్యూస్ లాగా పట్టి, దాంటో కొబ్బరినూనే కలుపుకోని జుట్టుకి పెట్టుకోండి.అరగంటసేపు ఈ మిశ్రమాన్ని కడగకూడదు.

* ఉసిరి, నిమ్మ రసాల్ని కలిపి వాడినా, జుట్టుకి మంచిది.అయితే ఒక్కసారి జుట్టుకి ఈ మిశ్రమాన్ని పట్టాక కనీసం రెండు గంటలపాటు అలాగే ఉంచుకోవాలి.

* ఒక గుడ్డులోని తెల్లసొన తీసుకోని ఒక టీస్పూన్ ఓలివ్ ఆయిల్ , మరో టీస్పూను తేనే కలిపి వాడండి.ఓ అరగంట తరువాత స్నానం చేసుకోండి.

* కొబ్బరినూనే, నిమ్మరసాన్ని కలిపి వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

* నాలుగు టీస్పూనుల హెన్నా పౌడర్ లోకి 2-3 టీస్పూనుల పెరుగు, 2-3 టీస్పూనుల తేనే కలిపి జుట్టుకి పట్టండి.

మార్పు మీరే చూస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube