నాటు నాటు సాంగ్‌కి చించేసిన ఇద్దరు సిస్టర్స్‌.. వీడియో చూస్తే ఫిదా!

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి.

 Natu Natu Song By Two Sisters , Sisters Dance, Viral Latest, News Viral, Social Media, Video Viral, Rrr ,natu Natu Song-TeluguStop.com

ముఖ్యంగా నాటు నాటు పాట ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.ఇందులోని డ్యాన్స్ చాలా మందిని ఉర్రూతలూగించింది.

సెలబ్రిటీలు సైతం ఈ పాటకు కాలు కదిపారు.అయితే తాజాగా ఇద్దరు సిస్టర్స్ ఈ పాట పాడటంతో పాటు డాన్స్ కూడా వేశారు.

 Natu Natu Song By Two Sisters , Sisters Dance, Viral Latest, News Viral, Social Media, Video Viral, Rrr ,Natu Natu Song-నాటు నాటు సాంగ్‌కి చించేసిన ఇద్దరు సిస్టర్స్‌.. వీడియో చూస్తే ఫిదా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియోని యూట్యూబ్ ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ వీడియోలో అంటారా, అంకిత అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు పాట పాడుతూ నాట్యం చేశారు.

ఈ వీడియోకి వేలల్లో లైకులు, వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అద్భుతంగా చేశారని కితాబిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువతులు మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించుతూ నాటు నాటు సాంగ్ పాట డాన్స్ వినొచ్చు.

వీరిద్దరు కూడా ఒరిజినల్ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి డ్రెస్ వేశారో అలాంటివే వేసుకున్నారు.అంతేకాదు వీరిద్దరూ వారి లాగానే డాన్స్ వేస్తూ ఆశ్చర్యపరిచారు.

సేమ్ స్టెప్స్ కొంచెం కూడా తేడా లేకుండా చేసి అబ్బురపరిచారు.మరో విశేషం ఏంటంటే వారు పాట కూడా పాడారు.

అంటారా, అంకిత సిస్టర్స్ డాన్సర్స్ మాత్రమే కాదు సింగర్స్ కూడా అని తెలుస్తోంది.అందుకే వారు అంత అద్భుతంగా పాడగలిగారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు.“వావ్, సూపర్.అదరగొట్టారు! అద్భుతం!!” అని కామెంట్లు చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube